వాట్సాప్ చాట్ హిస్టరీని ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు…!

-

మీరు ఐఫోన్ ని ఉపయోగిస్తున్నారా..? వాట్సాప్ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్ కి పంపించాలి అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఇప్పుడు వీలవుతుంది. త్వరలో వాట్సాప్ చాట్ హిస్టరని అంటే ఫోటోలు, వాయిస్ మెమోస్ సైతం ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ కి మధ్య పంపించడానికి వీలు అవుతుంది.

అయితే ఇది కొత్త గెలాక్సీ మోడల్స్ కి మాత్రమే అవుతుంది. ఇదిలా ఉంటే ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ కి పంపించడానికి అవుతుందా లేదా అనే దానిపై వాట్సాప్ ఇంకా ఏమీ చెప్పలేదు. అయితే ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న వాళ్ళకి ఫైనల్ గా వాట్సాప్ శుభవార్త చెప్పింది.

ఈ చాట్ ట్రాన్స్ఫర్ యాప్ సాంసుంగ్ న్యూర్ ప్రిమెర్ డివైస్లకి అవుతుంది. అలానే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ త్రీ మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ త్రి కి కూడా అవుతుంది. గతంలో అయితే చాట్ షేర్ చేసుకోవడానికి అయ్యేది కాదు. కేవలం స్క్రీన్ షాట్స్ మాత్రమే షేర్ చేసుకునే వారు కానీ ఇప్పుడు మాత్రం షేర్ చేసుకోవడానికి వీలు అవుతుంది.

ఇది ఇలా ఉంటే యాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించడం వలన చాట్ ట్రాన్స్‌ఫర్ అమలు చేయడం కష్టమని మెసేజింగ్ ప్లాట్‌ఫాం చెప్పింది. వాట్సాప్ మైగ్రేటింగ్ చాట్‌లు అన్ని కూడా WhatsApp, OS డెవలపర్లు మరియు OEM వాళ్ళు ఎక్కువగా పని చేయాల్సిన అవసరం వుంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news