ఆనందాన్ని కొలిచే మీటర్ డబ్బే కాదని తెలిపే అద్భుతమైన కథ..

-

డబ్బులోనే ఆనందం ఉందని దాన్ని సంపాదించడానికే జీవితాన్ని ఖర్చు చేస్తుంటారు. ఖర్చు పెట్టడానికి వెనుకాడుతూ, దాచడంలోనే ఆనందం దాగుందని తెగ సంపాదించేస్తుంటారు. దాని కోసం కొన్నింటినీ వదిలేసుకుంటారు కూడా. డబ్బొక్కటే జీవితం అనుకునేవాళ్ళు, డబ్బే ఆనందిస్తుందని నమ్మే వాళ్ళు చాలా మంది. ఐతే ఆనందాన్ని కొలిచే మీటర్ డబ్బే కాదని తెలిపే అద్బుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డేర్ టు డూ మోటివేషన్ లో వచ్చిన వీడియోలోంచి.

ఒకానొక ఊరిలో బాగా డబ్బున్న ఒకాయన ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. కొడుక్కి తామెంత ధనవంతులమో తెలియజేయాలని, డబ్బుల్లేక పేదలు ఎంత ఇబ్బంది పడతారో చూపించాలని, వాళ్ళందరితో పోలిస్తే మనమెంత ఆనందంగా ఉన్నామో చూపించాలని అనిపించి, ఒక వారం రోజుల పాటు వేరే చోటికి తీసుకెళతాడు. నదీ పక్కన గుడిసెల్లాంటి ఇళ్ళలో నివసించే జనాల దగ్గరికి తీసుకువచ్చి వారం రోజులు అక్కడే ఉంటారు. వారం అయ్యాక ఇంటికి వెళ్తున్నప్పుడు తండ్రి ఇలా అడుగుతాడు.

డబ్బుల్లేకపోతే పేదరికం ఎలా ఉంటుందో చూసావా అని అడుగుతాడు. దానికి కొడుకు, అవును నాన్నా, డబ్బుల్లేకపోవడం వల్ల వాళ్ళకి నాలుగు కుక్కలున్నాయి. మనకి ఒకటే ఉంది. మనింట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్ళకి అంతులేని నది. రాత్రిపూట కరెంట్ మనకి ఉంది. కానీ వాళ్ళకి నక్షత్రాల వెలుతురు. మనింట్లో చిన్న బాల్కనీ, వాళ్ళకి గుమ్మం దాటి బయటకొస్తే కనిపించేదంతా బాల్కనీయే. మనం అన్నం కొనుక్కుని తింటాం. వాళ్ళు వాళ్లే పండించుకుంటారు.

మనింట్లోకి ఎవరూ రాకుండా చుట్టూ కంచే వేసుకున్నం. కానీ వీళ్ళకి కంచెలాగా పక్కన స్నేహితులున్నారు. ఇప్పుడర్థమైంది మనం ఎంత పేదవాళ్ళుగా ఉన్నామో అని అన్నాడు. అలా చెప్పగానే తండ్రి షాకయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news