గుప్పెడంతమనసు 309 ఎపిసోడ్: రిషీ ముందు దేవయాని నిజస్వరూపం బయటపెట్టిన మహేంద్ర..కానీ ఇగోమాష్టర్ ఏం చేశాడంటే.

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, ధరణి రిషీ గురించి మాట్లాడుకుంటారు. రిషీ ఆనందమే నా ఆనందమే..వాడ్ని నేను ఎందుకు ఇబ్బందిపడతాను..వదిన రిషీ ఆనందంగా ఉండటం కూడా ఓర్చుకోవటం లేదు..చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు. ఇంకోవైపు రిషీ ట్యూబ్ ఫిక్స్ చేస్తుంటాడు..వసూ మీకు రిపేరింగ్లు, పంచర్లు వేయటం కూడా వచ్చా సార్ అంటే..ఆ ఎందుకు రాదు..కాలేజ్ అయిపోయాక పంచర్లు వేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తాను కదా అని రిషీ ఎటకారంగా అంటాడు. వసూ ఏంటి సార్ మీరు అంటే..మరి..కారు ఉన్న వాళ్లకు ఎవరికైనా..ఇవన్నీ తెలిసి ఉంటాయి అని..పక్కన ఉన్న టైర్ వసూని తెమ్మంటాడు. వసూ ఇచ్చి చిన్నప్పుడు టైర్ ఆట ఆడారా అని అడుగుతుంది. రిషీ టైర్ ఆటా..అంటే ఏంటి అంటాడు. వసూ చెప్తుంది..నాకు తెలియదు అని రిషీ అనే సరికి..వసూ రిషీ సైకిల్ టైర్ తో ఆడితే ఎలా ఉంటుందో..ఇమాజిన్ చేసుకుని నవ్వుతుంది. రిషీ ఎందుకు నవ్వుతునన్నావ్..నువ్వు ఆడావా చిన్నప్పుడు అని రిషీ అడిగితే..బోల్డన్ని సార్లు ఆడాను సార్…బాగుంటుంది సార్ అని వసూ చెప్పడంతో..రిషీ కూడా ఇమాజిన్ చేసుకుంటాడు.

వసూ కారులో ఉన్న వాటర్ తాగి..మీరు తాగుతారా అంటే..నా చేతులు బాలేదు ఎలా తాగుతాను చెప్పు అంటాడు..వసూ నేను తాగిస్తాను అంటుంది. కానీ రిషీ ఒప్పుకోడు. మొత్తానికి పని పూర్తి చేస్తాడు. రిషీ మొఖానికి గీజు పూసుకుంటాడు. వసూనే తుడుస్తుంది.కట్ చేస్తే వసూని ఇంట్లో డ్రాప్ చేస్తాడు. రిషీ ఏంటి ఈ మధ్య థ్యాంక్స్ లు చెప్పటం లేదు అంటే..మీరేగా తగ్గించమన్నారు అని వసూ అంటే..మానేయమనలేదుగా అని రిషీ అంటాడు. సరే మీకు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి అంతే కదా అంటే..ఇప్పుడు వద్దు సాయంత్రం రెస్టారెంట్ కి వస్తాను అప్పుడు చెప్పు అని రిషీ అంటే..ఏమైనా పని ఉందా సార్ అని వసూ అనే సరికి సరే రానులే బాయ్ అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఇంట్లోకి వస్తున్న వసూకి జగతి ఎదురుగా నిలబడి ఉంటుంది. జగతి వసూ ఏమైయ్ పోయావ్, ఏంటి వెళ్లుపోయావ్ అంటే కారు ట్రబుల్ ఇచ్చింది మేడమ్ అంటుంది వసూ. జగతి నాకు తెలియకుండా కారు ఎప్పుడు కొన్నావ్ అంటే..వసూ నాకు కారుఎక్కడది మేడమ్..ఏదో మీ పుణ్యమో, మీ అబ్బాయిపుణ్యమో అని తిరుగుతున్నాను అంటుంది వసూ. జగతి వెటకారం చాల్లేగాని, రిషీ నువ్వు వెళ్తుంటే..కారు ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది అంటావ్ అంతే కదా అంటుంది జగతి..వసూ పర్ఫక్ట్ మేడమ్ అంటుంది. కాలేజ్ లేదు కదా..మీరు ఇద్దరు ఎక్కడి కలిశారు అని జగతి అంటే..వసూ నసుగుతుంది..సర్లే వెళ్లు అంటుంది.

రిషీ ఇంటికి వస్తాడు. ధరణి కాఫీ ఏమైనా కావాల అని అడుగుతుంది. రిషీ హాల్ లో ఉండగానే..మహేంద్ర దేవయానిని పిలుస్తాడు. వస్తుంది. రిషీ ఇంటికి రాలేదని కంగారు పడుతున్నారు కదా..రిషీ వచ్చాడు అంటుంది. రిషీ వస్తే నాకెందుకు చెప్తున్నావు అంటుంది. మీరే కదా ఇందాక అన్నారు అని..మహేంద్ర రిషీ..ఏం రిషీ ఏంటి సంగతులు, హాలిడేస్ కదా..కాలేజ్ కి ఎందుకు వెళ్లావ్ ఇది నేను అడగలేదు వదినగారు అడిగారు అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు వర్క్ ఉంది వెళ్లాను అంటాడు. మరి వసూ కాలేజ్ కి వచ్చింది..వసూ కాలేజ్ కి వచ్చిందని వదినగారికి ఎలా తెలుసో నాకు తెలియదు అంటాడు మహేంద్ర. రిషీకి చిర్రెత్తుకొస్తుంది..పెద్దమ్మ అలా ఆలోచించరు, మీరు అనవసరంగా పెద్దను బ్రేమ్ చేస్తున్నారు. పెద్దమ్మ ప్రేమేంటో నాకు తెలుసు..మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను..వసుధార ఒక స్టూడెంట్ మాత్రమే..తన కంటూ లక్ష్యం ఉంది..ఆ దిశగా ప్రయాణిస్తుంది. నన్ను ఎవరూ ప్రభావితం చేయటం లేదు..మీరు అడిగారాని చెప్పారు కానీ, నాకు చెప్పటంకూడా చాలా చిరాక్గా ఉంది అనిచెప్పేసి వెళ్లిపోతాడు.

చూశారా వదినగారు..రిషీ మనసులో మీ స్థానం ఎంత గొప్పగా ఉందో. కానీ మీ మనసులో రిషీ స్థానం ఎలా ఉందో అంటాడు మహేంద్ర. దేవయాని వెళ్లిపోతుంది. రిషీ రూంలోకి వచ్చి జరిగింది ఆలోచిస్తాడు..వసుధార స్టూడెంట్ మాత్రమేనా, అంతకంటే ఏం కాదా, వసుధార నా గురించి ఎలా ఆలోచిస్తుంది. వసూ మీద నేను ఆదిపత్యం చూపిస్తున్నాను, చూపిస్తూనే ఉన్నాను..నా మనసులో ఏముందో ఎవరో చెప్తేనే నాకు తెలుస్తుందా అనుకుంటాడు అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news