గుప్పెడంతమనసు ఎపిసోడ్ 334: ఎమోషన్ లో డైలగ్స్ తో కంటతడిపెట్టించిన వసుధార..లగేజ్ సర్థుకుని వస్తున్నా ఆపని జగతి

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ అడిగిన ప్రశ్నలకు జగతి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది. మహేంద్ర జగతికి కాల్ చేస్తాడు. మహేంద్ర నీ ఆలోచనలో మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా చెప్పు ప్లీజ్ అంటే..జగతి సీరయస్ అవుతుంది.అందరూ నన్ను వేధించేవాల్లే తయారయ్యారేంటి, దేవయాని అక్కయ్య కారణంగా అందరికీ దూరంగా ఉన్నా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్. లేని బంధాలు వెతుక్కుంటూ వచ్చి నరకయాతన పడుతున్నా , నాకు నీ ఓదార్పు మాటలు అవసరం లేదు నన్ను వదిలేయండి, ఇప్పుడు వసూ నీకు తోడైంది..నువ్వు-వసు-రిషి అందరూ నన్ను వదిలేయండి, అందరికీ ఎలా చెప్పను, నాపై ప్రేమ-గౌరవం ఉంటే నన్ను అందరూ ఒంటరిగా వదిలేయండి, ఈ టాపిక్ మళ్లీ తీయెద్దు మహేంద్ర అని ఫోన్ కట్ చేస్తుంది. జగతి మాటలను వసుధార వెనుక నుంచి వింటుంది.

రిషీ- వసుధార

కాలేజీలో వసూ ఒంటరిగా కూర్చుని జగతి మేడం అన్నమాటల్ని తలుచుకుని బాధపడుతుంది. మేడమ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, నేను అక్కడ ఇష్టం లేదా, ప్రతి కష్ట సమయంలోనూ నాకు తోడుగా ఉన్నారు, కానీ ఇప్పుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, నన్ను ఎవ్వరు ఒక్కమాట అన్నా ఒప్పుకోని మేడం ఇప్పుడు వింతగా, విచిత్రంగా నున్ను అలా ఎందుకు అంటున్నారు అని కంటతడిపెట్టుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి వసుని ఏంటి ఇక్కడ కుర్చున్నావ్ అంటే..వసూ ఏం లేదు అంటుంది. ఒక్కదానివే ఇక్కడ కుర్చున్నావ్, ఏం ఆలోచిస్తున్నావ్ అని రిషీ అంటే..వసూ డల్ గా మాట్లాడుతుంది. ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు రిషి. ప్రతి మీటర్ ఏదోఒక ఉష్ణోగ్రత దగ్గర కరిగిపోతుంది కదా..మనిషి కూడా ఎక్కడో దగ్గర మనసు విరగక తప్పదు, నీరులా కరిగిపోక తప్పదంటుంది వసూ.. ధైర్యంగా ఉండే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావ్ అంటాడు రిషి. నీ పర్సనల్ అయితే ఏం చెప్పొద్దులే అనేసి లేచి వెళ్లిబోతుంటే..జగతి మేడం అంటుంది వసూ. రిషీ ఆగుతాడు. జగతి మేడం ఏంటి అంటాడు రిషీ..వసూ..జగతి మేడమ్ ఆలోచనలు, ఆచరణ ఒకేలా ఉంటాయి, మేడం విషయంలో నా నమ్మకం ఎప్పుడూ ఓడిపోలేదు, మొదటి సారి ఎందుకో అలా అనిపిస్తోంది, కానీ.. ఈ మధ్య మేడం కొత్తగా మాట్లాడుతున్నారు, మునుపెన్నడూ చూడని జగతి మేడమ్ కనిపిస్తున్నారు..రిషీ మనసులో ఇప్పటికైనా వసుధార జగతి మేడమ్ నుంచి దూరంగా వెళ్తుంది అనుకుంటాడు. నేను తన దగ్గర ఉండడం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు సార్ అని చెబుతుంది. మేడమ్ స్వభావానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు..నిజానికి ఇవన్నీ చెప్పకూడదు, అడిగారు కాబట్టి చెప్తున్నాను అంటుంది.
తనకి ఇష్టం లేనప్పుడు నువ్వు అక్కడ ఉండడం అవసరం లేదుకదా అంటాడు రిషి. ఎక్కడోచోట ఉండడం కాదు సార్.. నా సమస్య, మేడం కొత్తగా అలా మాట్లాడటమే నమ్మలేకపోతున్నా అని చెబుతుంది. వసూ. వెళ్లిపొమ్మని చెప్పేశారా అని రిషి అడిగితే..అలా చెప్పినా బావుండేది, కనీసం..తప్పేంటని అడిగేదాన్ని.. కానీ చెప్పకనే చెబుతున్నారంటుంది. మనకి ఇష్టం అయిన వాళ్ల మనసు వాళ్లకన్నా మనకే ఎక్కువ తెలుస్తుంది…అది మేడం సహజత్వం కాదు సార్, మేడమ్ అసలు అలా ఆలోచించరు అంటుంది. ఇవన్నీ తెలిసినప్పుడు వద్దని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నప్పుడు అక్కడే ఉండడం ఎందుకని …ఏదైనా హాస్టల్లో అంటాడు రిషీ. సర్ కాఫీ లేకపోతే టీ తాగొచ్చేమో , భోజనం లేకపోతే టిఫిన్ చేయొచ్చేమో కానీ అన్నింటికీ ఆల్టర్ నేట్ గా ఇంకొకటి ఉండదు సర్, నేను హాస్టల్ కి వెళ్లలేను సర్ అంటుంది. జగతి మేడం కూడా అంతే..ఆవిడకు ఆల్టర్ నేట్ ఉండదు, ఆవిడ ఒక్కరే… ఆ స్థానంలో నేను ఇంకొకర్ని ఊహించుకోలేను సార్ అంటుంది. మేడం మాట్లాడే మాటలు అసలు మేడంవే కావు , నాకు అర్థమవుతున్నాయి, తను అలా మాట్లాడదు, ఎవరో ఏదో అన్నారు..అది ఎవరో చెప్పడం లేదు..కానీ నేను తెలుసుకుంటాను అంటుంది.
మేడంని బాధపెట్టను, హాస్టల్ కి వెళ్లను అంటున్నావ్..మరెక్కడి వెళతావ్ అని అడిగిన రిషితో..మేడంని విడిచిపెడితే హాస్టల్ కి వెళ్లేది లేదు, ఎక్కడికి వెళ్తానో ఏమో.. నాకే తెలియదు అంటుంది. ఎక్కడినుంచో వచ్చాను, అమ్మానాన్నలను అక్కా తమ్ముడిని అందర్నీ వదిలేసి మేడంలోనే అందర్నీ చూసుకుంటున్నాను, మేడంకి నావల్ల ఇబ్బంది కలుగుతుందంటే నేను అక్కడ ఉండలేను సార్, చెప్పలేను ఎక్కడికి వెళతానో ఏమో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ మేడం చెప్పినట్టు వినొచ్చు కదా అన్న రిషితో..వింటాను సార్..మేడమ్ ఏం చెప్పినా వింటాను..నా కోసం మానాన్ననే ఎదిరించారు, నాకోసం ప్రతిసారీ రక్షణగా నిలిచారు..అలాంటి మేడం మనస్ఫూర్తిగా చెబితేనే వింటాను కానీ ఆమెని ఎవరో వ్యక్తి కట్టిపడేస్తున్నారు. మేడమ్.. నన్ను వెళ్లిపొమ్మంటున్నారంటే నాకన్నా ఎక్కువగా తను నలిగిపోతున్నారని నాకు అర్థమైంది సార్.., నాకన్నా ఎక్కువగా తను బాధపడుతున్నారు, వినిపించే మాటలు మేడంవి కావు సార్ అంటుంది. రిషీ వసుని ఇంట్లోంచి హాస్టల్ కి పంపించేయమని జగతికి చెప్పిన మాటలు రిషి గుర్తుచేసుకుంటాడు. నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగిన రిషితో..వద్దు సార్ ఉంటే మేడం దగ్గర ఉంటా, లేకపోతే..ఎక్కడికైనా వెళ్లిపోతాను.. ఎవ్వరికీ భారం కాకుండా, ఎవ్వరి కంటికీ కనిపించకుండా వెళ్లిపోతాను సార్ అంటుంది. రిషీకి సౌండ్ ఆఫ్ ఇగ..ఏంటి వసుధార ఇలా మాట్లాడుతుంది..హాస్టల్ కి వెళ్తుందనుకుంటే.ఎక్కడికో వెళ్తాను అంటుంది ఏంటి అనుకుంటాడు. నేను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడైనా బతికే ధైర్యం నాకుంది సార్ అని లేచి వెళ్తుంది. రిషీ అసలు ఎక్కడికి వెళతావ్, ఏం చేస్తావ్ అని అడిగినా.. నేను నా మనసు చెప్పింది చేయబోతున్నా అనేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది. నేను ఒకటి అనుకుంటే..తను ఒకటి ఆలోచిస్తుందేంటి అనుకుంటాడు.

 జగతి ఇంట్లో

లోపల నుంచి లగేజ్ సర్దుకుంటూ జగతి మేడం తనకోసం చేసిన ప్రతి సహాయాన్ని గుర్తుచేసుకుంటుంది వసుధార. జగతి మాత్రం అలానే నుల్చుని ఉంటుంది. సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చిన వసుధార జగతి మేడం దగ్గర నిల్చుటుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అలా బయటకు వెళ్లిపోతుంది. జగతి అటువైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ లో వసుదార ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news