గుప్పెడంతమనసు సెప్టెంబర్ 22 ఎపిసోడ్ 249: మహేంద్ర కోసం జగతి ఇంటికొచ్చిన రిషీ..లేరని చెప్పడంతో రిషీలో మొదలైన టెన్షన్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రవీంద్ర.. రిషీ చిరాకుగా కనిపించాడు అంటూ భార్యకు చెప్తాడు. దేవయాని ఏం జరిగిందో అడగాల్సింది కదండి అంటుంది. ఇక్కడే నీ ఆలోచనలకు నాకు తేడా ఉంది..ఆనందంలో ఉన్నవాడి దగ్గరకు వెళ్లి ఎందుకు ఆనందంగా ఉన్నావ్ అని అడగొచ్చు..చిరాకుగా ఉన్నవాడ్ని అడగకూడదు అంటాడు. ఆ మాటకు ధరణి మనసులో నవ్వుకుంటుంది. దేవయాని ఏంటి అలా చూస్తున్నావ్, మావయ్యగారు వచ్చారుకదా వెళ్లి మంచినీళ్లు, కాఫీ తీసుకురా అంటుంది. రవీంద్ర ఇప్పుడేం వద్దు అని రిషీ నీకు ఏమైనా ఫోన్ చేశాడా అని అడుగుతాడు. ధరణి లేదు అంటుంది. వచ్చాకా నువ్వే అడుగు..వాడి చిరాకుకు కారణం ఏంటో అని అంటాడు. దేవయాని మనసులో ఉదయం వసూతో జరిగిన గోడవ గురించి రిషీకి చెప్పేసి ఉంటుందా అనుకుంటుంది. రవీంద్ర.. వసుధార కూడా అని చెప్పబోతాడు ఇంతలోనే దేవయాని ఆత్రంగా..ఆ కూడా వసుధార..వసుధార ఏమైనా చెప్పిందా..ఆ వసుధారే రిషీ మనసు మార్చేసి ఉంటుంది అంటుంది. రవీంద్రకు చిర్రేత్తిపోతుంది…ఏంటి దేవయాని నువ్వు వసుధార కూడా ఏదోలా ఉంది అని చెప్పబోతున్నా..అన్నీ నువ్వే ఉహించుకుంటావా అనేసి వెళ్లిపోతాడు.

దేవయాని దరణీతో రిషీకి ఫోన్ చేసి ఏమైందో కనుక్కో అంటుంది. ధరణి..అత్తయ్యగారు ఫోన్ చేయమంటే చేస్తాను..ఒకవేళ వసుధార ఏం చెప్పకపోతే మనమే అనుమానం కలిగించినవాళ్లం అ‌వుతాం కదా అంటుంది. దేవయాని ఏంటి నాకే సలహాలు ఇస్తున్నావా అంటుంది. ఆలోచన వచ్చింది చెప్పాను అంటుంది. సర్లే నువ్వు చెప్పింది కరెక్టేలే ఫోన్ చేయొద్దని చెప్పి వెళ్లిపోతుంది. ఏం జరిగిందో వసూని అడుగుదాం అనుకుని వసూకి ఫోన్ చేస్తుంది.

ఇంకోవైపు వసూ రిషీ రెస్టారెంట్ లో ఉంటారు. వసూ కాఫీ, ఐస్ క్రీమ్ తెస్తుంది. రీషీ కాఫీ తాగబోతాడు..ఆగండి సార్ అంటుంది వసూ..ఏంటి 50 50 హా అని అడుగుతాడు. మీకో సప్రైజ్ ఉంది అని ఐస్ క్రీమ్ ముందుపెడతుంది. ఇది ఎవరికి అని అడుగుతాడు మీకే అంటుంది వసూ.. వసూ కుర్చుని కాఫీ మీ కోపం వేడివేడిగా ఉంటుంది. ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది మీ మంచితనం. రెండూ ఒకేచోట ఉండలేవ్ కదా..రెండూ ఒకేసారి తినిచూడండి..అసలు చూడ్డానికే బాలేదు అంటుంది. నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయ్ అసలా అంటాడు రిషీ.. మీరు నా మీద ఫైల్ విసిరేసినందుకు పరిహారం అనుకోండి అంటుంది వసూ..పరిహారం అని పెద్దపదమే వాడవు..కాని ఇది పనిష్మెంట్ అనొచ్చేమే కదా అని కాఫీ తాగి ఐస్ క్రీమ్ కూడా తినేస్తాడు.

వసూ ఇలా తినేస్తున్నాడేంటి అనుకుని ఐస్ క్రీమ్ లాక్కోని..సార్ నేను ఏదో సరదాగా అంటే మీరేంటి సార్ రెండు తినేశారు అంటుంది. తింటూ తాగాను, తాగుతూ తిన్నాను అంటాడు రిషీ..వసూ నా ఉద్దేశం ఏంటంటే అని చెప్పబోతుంది.. రిషీ ఈ కొటేషన్స్ బాగా ప్రిపేర్ అయినట్లు ఉన్నావుగా అంటే..ఏం లేదు సార్..ఇవి రెండూ బాగుంటాయ్..కానీ ఒకేచోట కలిస్తే బాగుండవ్..ప్రేమ కురిపించాల్సిన చోట కురిపించాలి..కోపం చూపించాల్సిన చోట చూపించాలి ఒకే దగ్గర ఉంటే బాగుండవ్ అంటుంది. ఇది నార్మల్ గా కూడా చెప్పొచ్చు కదా అయినా నేను సీరియస్ గా తీసుకోలేదు ఇప్పుడు కూడా తాగేస్తాను అంటాడు. వసూ ఇంకో కాఫీ తెస్తాను అని చెప్తుంది. రిషీ వద్దూ అని లేచి..ఇది కొత్త ఎక్సీపీరియన్స్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ బాగుంది..థ్యాంక్స్ అని చెప్పి వెళ్లిపోతాడు. నేను అనుకున్నది ఏంటి..జరిగింది ఏంటి ఇలా జరిగిందేంట్రా అనుకుంటుంది వసూ.

మరోపక్క జగతి ఇంట్లో రిషీ మాటలను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. మహేంద్రను ఇంట్లోకి రాకుండా ఆపిన సీన్ గుర్తుచేసుకుని..రిషీ నన్ను మాటలు అన్నాడు..కానీ నేను మహేంద్రను అన్నాను, అనవసరంగా మాట్లాడాను అనుకుని మహేంద్రకు ఫోన్ చేయబోతుంది..ఇంతలో శిరీష్ వస్తాడు. ఎడ్యూకల్చర్ గురించి డౌట్ అని అడుగుతాడు. చెప్తాను అని జగతి కాఫీ తెవటానికి వెళ్తుంది. మనసులో వసూ త్వరగా వస్తే బాగుండూ అనుకుంటుంది.

వసూ ఆటోలో ఇంటికొస్తూ..రెస్టారెంట్ లో జరిగిన సీన్ తలుచుకుని నవ్వుకుంటుంది. ఇంతలో ధరణి మిస్డ్ కాల్ చూసి కాల్ చేస్తుంది. అత్తయ్యను కలిసిన విషయం చెప్పావా అని అడుగుతుంది ధరణి..కానీ పక్కన ఉన్న సౌండ్స్ వల్ల ఏం వినిపించదు. కాల్ కట్ చేస్తారు. ధరణీ వసూ మాటలను చూస్తే బానే ఉంది అనుకుంటుంది. ఇంతలో రిషీ వస్తాడు. డాడ్ వచ్చారా అని అడుగుతాడు. ధరణీ రాలేదని చెప్పి రిషీ అంటుంది. కాఫీ అని అడగండి వదినా అని రెస్టాంరెంట్ లో కాఫీ సీన్ చెప్తాడు. అలా ఎందుకు తినాల్సొచింది రిషీ..అని వసుధార కోసం తిన్నావా అని అడుగుతుంది. లేదు ఎవరికోసం నేను తినను..అంటూ కొటేషన్స్ చెప్తాడు. ధరణి వసుధార నీకేమైనా చెప్పిందా అంటే..తను నాకెన్నో చెప్తుంది..కానీ అన్నీ వినాలని లేదు కదా వదినా అంటాడు. ఫైనల్ గా వెళ్తూ..వదినా ఈ మధ్య మీరు వసుధార గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు..అంత అవసరం లేదు అని చెప్పి వెళ్తాడు. ధరణి మనసులో ఇది మరీ బాగుంది తను ఆలోచించి నన్నంటాడేంటో అనుకుంటుంది.

ఇటుపక్క జగతి శిరీష్ కి ఎడ్యూకల్చర్ గురించి అప్పటికే చెప్పేసి ఉంటుంది. శిరీష్ క్లాప్స్ కొట్టి ఏమో అనుకున్నాను కానీ..ఇంత అర్థం ఉందని అస్సలు ఊహించలేదు అంటూ బాగా బిస్కెట్లు వేస్తాడు. తనపాటికి తను ఏదోఒకటి మాట్లాడతాడు. జగతి చదువు గురించి బాగా వివరిస్తుంది. శిరీష్ మీరు గ్రేట్ మేడమ్ అంటూ పొగుడుతాడు. ఇంతలో వసుధార వస్తుంది. ఏంటి శిరీష్ మోడన్ ని పొగుడుతున్నావ్..నీకు పోగడకపోయినా సకలమర్యాదలు జరుగుతాయ్ లే అని వెటకారంగా అంటుంది. హలో వసూ నేను వచ్చి చాలా సేపు అయింది కాఫీ కూడా తాగాను అంటాడు అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో రిషీ జగతి ఇంటికి వచ్చి డాడ్ ని పిలవండి అంటాడు. జగతి ఆయన లేరని చెప్తుంది. రావొద్దన్నాని చెప్పాను అని రిషీకి చెప్తుంది. నా మీద కోపం ఉంటే మా డాడ్ మీద చూపిస్తారా అని రిషీ కోపంగా అక్కడినుంచి వెళ్తాడు. వసుధార రిషీకి ఫోన్ చేసి..వెతకండి సర్..మీరు, కాలేజ్, జగతిమేడమ్ మే కదా ఆయన లోకం..ఇక్కడ లేరంటే ఎక్కడ ఉన్నారో వెతకండి సార్ అని టెన్షగా చెప్తుంది. రిషీ ఫోన్ కట్ చేసి..నా టెన్షన్ లో నేనుంటే ఈ పొగరేంటో నాకు సలహాలు ఇస్తుంది అనుకున్నాడు. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news