ఆర్‌బీఐ కీలక నిర్ణయం… సర్వీసులు విస్తరణ..!

-

తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనితో నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులను నాన్ బ్యాంక్ పేమెంట్ ఆపరేటర్లకు కూడా తీసుకు రానున్నట్టు చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే.. నేషనల్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ NEFT, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ RTGS ఫెసిలిటీస్‌ను ఇక నుండి మరిన్ని సంస్థలకు కూడా అందుబాటులో వుంచుతున్నట్టు ఆర్బీఐ తెలిపింది.

ఈ నిర్ణయం తో ఇక నుండి నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు కూడా నెఫ్ట్, ఆర్‌టీజీస్ సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇప్పుడు కేవలం బ్యాంకులు మాత్రమే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి పేమెంట్ సర్వీసులను ఉపయోగించుకోవడం మాత్రమే కాక నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు కూడా ఈ సర్వీసులను వినియోగించుకోవచ్చు.

ఇక నుండి ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ PPI, కార్డ్ నెట్‌ వర్క్స్, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ప్లాట్‌ఫామ్స్ కూడా నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీలను వాడచ్చు .

ఇది ఇలా ఉంటే ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్ లిమిట్ పెంపు కూడా వీటిలో ఒకటి. డిపాజిట్ లిమిట్‌ను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news