ఈ డెబిట్ కార్డు తీసుకుంటే ఇన్ని లాభాలా…?

-

మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా…? అయితే తప్పకుండ ఈ విషయాలని తెలుసుకోవాలి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డెబిట్ కార్డుని తీసుకు వచ్చింది. దీని కోసం ఎస్‌బీఐ ఐఓసీఎల్ ‌తో జతకట్టింది. అయితే దీని కారణంగా ఈ డెబిట్ కార్డు వాహనదారలుకు అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది కాంటాక్ట్‌లెస్ కార్డు. రూపే కార్డు. మరి దీని వల్ల ఏం లాభం కలుగుతుంది..? ఈ విషయం లోకి వస్తే… ఎస్‌బీఐ ఐఓసీఎల్ డెబిట్ కార్డు తీసుకున్న వారు ప్రతి రూ.200 కొనుగోలుపై 6 రివార్డు పాయింట్లు పొందొచ్చు. నెలవారి ఫ్యూయెల్‌ పై ఎలాంటి పరిమితులు ఉండవు.

ఇది కనుక మీరు ఇండియన్ ఆయిల్ ఫ్యూయెల్ స్టేషన్ ‌లో చేసే ఖర్చులకు ఇది వర్తిస్తుంది గమనించండి. వెహికల్‌కు ఫ్యూయెల్ ని ఈ కార్డు ఉపయోగించి కొట్టిస్తే లాయల్టీ పాయింట్లు కూడా వస్తాయి. అలానే మీరు కనుక ఈ కార్డుని డైనింగ్, మూవీస్, గ్రాసరీ, యుటిలిటీ బిల్లు చెల్లింపుల పై ఉపయోగిస్తే కూడా మీకు రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఈ కార్డుని మీరు దేశంలో ఎక్కడైనా ఉపయోగించొచ్చు ఇది వర్తిస్తుంది.

ఈ కార్డు ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే… ఎస్‌బీఐ బ్రాంచుకు వెళ్లి ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది కాంటాక్ట్‌లెస్ కార్డు కావడం వల్ల రూ.5 వేల వరకు లావాదేవీలను మీరు చాలా సులువుగా, తక్కువ సమయం లోనే చేసేయొచ్చు. ఎన్‌ఎఫ్‌సీ టర్మినల్స్ వద్ద డెబిట్ కార్డును ఉంచితే ఆటోమేటిక్‌గానే మీ అకౌంట్ నుంచి బిల్లు మొత్తం కట్ అవుతుంది. పైగా ఏ ఓటీపీ పని కూడా ఉండదు. ఈ కార్డు ట్యాప్ అండ్ పే టెక్నాలజీ తో పని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news