ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్ లో మార్పులు… వివరాలు ఇవే…!

-

కేంద్ర ప్రభుత్వం కొత్త సిస్టమ్ ని అప్రూవల్ చేసింది. దీనితో ఎస్సీ విద్యార్ధులకి స్కాలర్ షిప్ లో ఆలస్యం ఉండదని చెప్పారు. ఒకసారి స్కాలర్షిప్ కి అప్లై చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా ఎస్సీ విద్యార్థులకు డైరెక్ట్ గా అకౌంట్లోకి డబ్బులు పంపిస్తారని చెప్పారు. ఈ కొత్త సిస్టం ప్రకారం ఈ డబ్బులు వస్తాయి.

ఈ కొత్త ఫండింగ్ ప్రకారం కొండ ప్రాంతాల్లో వారు 10 శాతం మైదాన ప్రాంతాల్లో వాళ్లు 40 శాతం ఇవ్వాలి. స్కాలర్షిప్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే… మినిస్ట్రీ స్కాలర్ షిప్ డెడ్లైన్లు పెట్టేసింది దీనిలో మొత్తం నాలుగు స్టేజ్లు ఉన్నాయి.

విద్యార్థులు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకున్న 75 రోజుల్లో గా స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వెళ్తాయి.
అలానే అప్లై చేసుకున్న 90 రోజుల్లో కేంద్రం నుంచి డబ్బులు అందుతాయి.
విద్యార్థులు కనుక ఏప్రిల్ మరియు జూలై లో అప్లై చేసుకుంటే ఆగస్టు 15న రాష్ట్రం నుండి మరియు ఆగస్టు 30న కేంద్రం నుంచి అందుతాయి.

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లో పెద్ద మార్పులు:

విద్యార్థులు కనుక డిసెంబర్ 1 నుంచి జనవరి 31 లోగా అప్లై చేసుకుంటే రాష్ట్రం నుంచి ఫిబ్రవరి 28న అందుతాయి మరియు కేంద్రం నుంచి మార్చి 15న అందుతాయి. విద్యార్థులకు సరిగ్గా డబ్బులు అందడం లేదని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు కారణంగా వాళ్ల చదువులపై ప్రభావం పడుతోందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news