మీ-సేవ సెంటర్‌కు వెళ్లి ఈ-కార్డును అప్లై చేసుకొండి.. రూ.5 లక్షల వరకు బీమా పొందండి..!

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ‘ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ అభిమాన్’ స్కీంను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇంటింటికీ ఉచితంగా పీవీసీ కార్డులను అందించనుంది. ఈ కార్డును పొందాలంటే సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్, మీ-సేవ సెంటర్‌కు వెళ్లి ఈ-కార్డును అప్లై చేసుకోవాలి. కార్డు అప్లికేషన్‌కు రూ.30 ఖర్చు అవుతుందని కేంద్రం వెల్లడించింది. ఆయుష్మాన్ యోజన పథకం ద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి రూ.5 లక్షల వరకు బీమా పొందవచ్చు.

ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ స్కీం
ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ స్కీం

ఆయుష్మాన్ ఆప్కే అభియాన్ స్కీం ఎలిజబులిటి ఉన్న వ్యక్తులకు మొదటగా స్థానికంగా ఉన్న మీ-సేవ కేంద్రానికి వెళ్లి మీ మీ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఆయుష్మాన్ కార్డులు జారీ అవుతాయి. ఈ కార్డుతో ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, బీమా వంటివి రూ.5 లక్షల వరకు డబ్బులు పొందవచ్చు. ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే కేంద్రం ఈ స్కీం ద్వారా డబ్బులు అందిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ స్కీంలో చేరి.. అన్ని రకాల బెనిఫిట్స్ పొందాలని, అనారోగ్య సమస్యలుంటే ఈ కార్డు ద్వారా డబ్బులు చెల్లించవచ్చని కేంద్రం పేర్కొంది.

ఇప్పటికే ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ పథకంలో భాగంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేరాయి. ఈ పథకంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ సీఈఓ ఆర్ఎస్ శర్మ కోరారు. పేద ప్రజలపై ఆరోగ్య భారం పడకూడదని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఇప్పటికే ఈ పథకంలో ఛత్తీస్‌గఢ్, బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు చేరాయని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 28 లక్షల కార్డులు, మధ్యప్రదేశ్‌లో 1.12 లక్షలు, పంజాబ్‌లో 39 వేలు, ఉత్తర ప్రదేశ్‌లో 1.53 లక్షలు, బీహార్‌లో 17,500, హర్యానాలో 9,600, జమ్మూకశ్మీర్‌లో 13,800 కార్డులు తయారు చేయబడ్డాయన్నారు.

కార్డు పొందాలంటే..
ఆయుష్మాన్ భారత్ యోజన లబ్ధిదారులు ముందుగా ఈ-కార్డును తయారు చేసుకోవాలి. దీనికోసం కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి.. మీ వివరాలను ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ స్కీంలో రిజిస్టర్ చేయించుకోవాలి. అలా మీరు ఈ-కార్డు పొందవచ్చు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలు, 54కోట్ల సభ్యులు రిజస్టర్ చేయించుకున్నారు. ఇప్పటివరకు కేవలం 1.25 కోట్ల కార్డులు తయారు అయ్యాయి.