కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంది. దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ డిమాండ్ బాగా పెరిగింది.
ఆక్సిజన్ సిలిండర్ లాగే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కూడా ఉపయోగ పడుతుంది.కాన్సెంట్రేటర్స్ ఐదు నుండి పది లీటర్ల వరకు ఆక్సిజన్ నిమిషానికి సప్లై చేస్తోంది. 90 నుంచి 95 శాతం వరకు శుద్ధమైన ఆక్సిజన్ ని అది అందిస్తుంది.
ఆక్సిజన్ తాంక్స్ అయితే 24 గంటల పాటు పవర్ మీద రీఫిల్ చేసుకుంటూ ఉంటే అవి పని చేస్తూ ఉంటాయి. కానీ ఇది అలా కాదు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ని ఆన్లైన్ లో ఎలా కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్ లైన్ ద్వారా కూడా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ని కొనుగోలు చేయవచ్చు.
ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనకు దొరుకుతాయి. ఆక్సిజన్ వాడకం సడన్గా పెరిగి పోవడంతో ఆక్సిజన్ కాన్సెంట్రేట్స్ అవుటాఫ్ స్టాక్ లో ఉన్నాయి. మీరు కావాలంటే వెబ్సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు. కానీ ఫేక్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి.
ఆక్సిజన్ కాన్సెంట్రేట్ ని అమ్మే వెబ్సైట్స్:
1 ఎంజి: వెబ్సైట్ ఈక్వినాక్స్, ఇనోజెన్, ఆక్స్లైఫ్తో సహా వివిధ బ్రాండ్ల నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అమ్ముతోంది. రూ. 50,000 నుండి రూ. 2,95,000 వరకు ఇక్కడ దొరుకుతాయి.
తుష్టి స్టోర్: మీరు OCM నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ని రూ. 63,000 నుండి రూ. 1,25,999 వరకు ఇక్కడ కొనచ్చు.
నైటింగేల్స్ ఇండియా: ఫిలిప్స్, ఆక్సిమెడ్, డెవిల్బిస్ ఓసి, ఇనోజెన్, ఒలెక్స్ ఓసి నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ రూ. 37,800 నుండి రూ. 2,15,000 వరకు ఇక్కడ దొరుకుతాయి.
కోల్మెడ్: గ్రీన్స్ ఓసి, నిడెక్ నువోలైట్, డెవిల్బిస్, మరియు యువెల్ తో సహా వివిధ బ్రాండ్ల నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ రూ. 34,000 నుండి ఉంటాయి.
హెల్త్క్లిన్: ఆస్పెన్, ఈక్వినాక్స్, హేమోడియాజ్ నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ రూ. 35,000 నుండి రూ. 51,000 వరకు ఇక్కడ లభిస్తాయి.
హెల్త్జీ: ఈక్వినాక్స్, లైఫ్ ప్లస్ ఓసి నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని రూ. 27,499 నుండి 1,29,999 రూపాయలు వరకు ఇక్కడ కొనచ్చు.