చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నా, ఇంజక్షన్ చేయించుకోవాలన్నా భయపడుతుంటారు. ట్యాబ్లెట్స్‌లో ఉండే చేదు నాలుకకు తాకగానే మన ముఖంలో ఎక్స్‌ప్రెషన్ ఘోరంగా ఉంటుంది. నోరంతా ఒకరకమైన వికారంగా అనిపిస్తుంది. అదే ట్యాబ్లెట్స్‌కు పైన కవర్‌లా ఉంటే ఈజీగా వేసుకోవచ్చు. కొన్ని మాత్రలకు పైన ప్లాస్టిక్‌లా ఉండే షల్ ఉంటుంది. ఇలాంటివి వేసుకున్నప్పుడు లోపల ఆ షల్ ఎలా కరుగుతుంది..? అది ప్లాస్టిక్ అన చాలా మంది అనుకుంటారు.. కానీ అది ప్లాస్టిక్ కాదు.. మరి ఏంటిది..? ఈ వివరాలన్నీ మీకోసం..!!
క్యాప్సూల్ కవర్ ఎలా తయారు చేస్తారంటే..
క్యాప్సూల్ బయటి షెల్ దేనితో తయారు చేస్తారో చాలామందికి తెలియక పోవచ్చు.. క్యాప్సూల్, బయటి కవర్ స్పర్శకు ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, అయితే ఇది వాస్తవానికి జెలటిన్‌తో తయారు చేయబడింది, ప్లాస్టిక్ కాదు. జెలటిన్ రుచిలేని, పారదర్శకమైన, రంగులేని, ఆహార పదార్ధం. ఇది గ్లైసిన్, ప్రోలిన్ అనే అమైనో ఆమ్లాలతో తయారవుతుంది. ఇది ప్రధానంగా జంతువుల ఎముకలు, వాటి అవయవాల నుంచి తయారు చేస్తారు..ఎముకలు, అవయవాలను ఉడకబెట్టడం ద్వారా జెలటిన్ పొందబడుతుంది. అయితే, క్యాప్సూల్ కవర్లు జెలటిన్‌తో మాత్రమే కాకుండా, కొన్ని క్యాప్సూల్స్ సెల్యులోజ్‌తో కూడా తయారవుతాయి. ఈ క్యాప్సూల్స్ శాఖాహారం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా కూడా ఉంటాయి.
క్యాప్సూల్ కడుపులో ఎలా కరిగిపోతుందంటే..
క్యాప్సూల్ వెంటనే కడుపులో కరిగిపోయే విధంగా తయారవుతుంది. కడుపులోని వేడి, ఆమ్లంతో సహా అన్ని కారకాలు ఇది కరిగేందుకు కారణమవుతాయి. క్యాప్సూల్ కరిగిపోయిన వెంటనే, దానిలో ఉపయోగించే మందులు శరీరంలో పనిచేయడం ప్రారంభిస్తాయి.
జెలటిన్‌తో ఇవి కూడా..
జెలటిన్ క్యాప్సూల్స్ తయారు చేయడానికి మాత్రమే కాకుండా, పౌడర్లు, జెల్లీలు, ఇతర ఆహార పదార్థాలను తయారు చేయడానికి కూడా వాడతారు. జెలటిన్లు ప్రోటీన్ మంచి మూలం. ఇది కాకుండా, ఇది రాగి, సెలీనియం, భాస్వరం, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం అని నిపుణులు అంటున్నారు.
మొత్తానికి అలా క్యాప్సూల్ షల్‌ను తయారు చేస్తారు. కొన్నింటికే ఇలా షల్ ఎందుకు ఉంటుందంటే.. ఇవి సాధారణ మాత్రల్లా ఉంటే వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇలా షల్ ఉండే క్యాప్సుల్స్ లోపలికి వెళ్లాక ప్రభావంతంగా పనిచేస్తాయట.