ఈ అదిరిపోయే స్కీమ్స్ తో ప్రతీ నెల డబ్బులు పొందొచ్చు…!

-

మీరు సంపాదిస్తున్న డబ్బులతో మంచి స్కీమ్ లో చేరాలని, ప్రతీ నెల డబ్బులు పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఈ స్కీమ్స్ గురించి తప్పక తెలియాలి. ఇప్పుడు మూడు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చేరితే ప్రతి నెలా డబ్బుల వస్తాయి. మరి వాటికి సంబంధించి వివరాల లోకి వెళితే…

ఈ స్కీమ్స్ అందరికీ అందుబాటులో వుండవు. ఇవి కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అది కూడా సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే వర్తిస్తాయి. ప్రతి నెలా డబ్బులు పొందాలని మీరు అనుకుంటే… ముందుగానే ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

నిజంగా ఇవి సీనియర్ సిటిజన్స్‌కు బెస్ట్ స్కీమ్స్ అనే చెప్పాలి. రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్స్‌కు పని చెయ్యడం కుదరదు. కనుక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS, పీఎం వయ వందన యోజన PMVVY, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ POMIS అనే స్కీమ్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ స్కీమ్స్ నుండి 7.4 శాతం వడ్డీ వస్తుంది. మినిమమ్ వెయ్యి నుండి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు.

మూడు నెలలకు ఒకసారి డబ్బులు పొందొచ్చు. స్కీమ్ టెన్యూర్ 5 ఏళ్లు. ఇది ఇలా ఉంటే ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకం గురించి చూస్తే… ఈ స్కీమ్ టెన్యూర్ 10 ఏళ్లు. అయితే 60 ఏళ్లు దాటిన వారు మాత్రమే దీనిలో చేరడానికి అవకాశం. నెలనెలా మీరు డబ్బులు తీసుకోవచ్చు. అలానే దీనిలో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version