జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

-

కరోనా నేపథ్యంలో గూగుల్‌ మీట్‌ ఉపయోగం విపరీతంగా పెరిగింది. అయితే గూగుల్‌ మీట్‌ కాల్స్, మీటింగ్లను వినియోగదారులకు 24 గంటలపాటు ఉచితంగా అందించే ఆఫర్‌ను పొడిగించింది. ఈ జూన్‌ వరకు ఆఫర్‌ను పొడగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. వర్క్‌ ఫ్రం హోం చేసే ఉద్యోగులు తరుచూ వీడియో ద్వారా మీటింగ్లకు హాజరు కావాల్సి ఉంటుంది. వీరు గూగుల్‌ మీట్, జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫర్‌ పొడగింపు వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వరకు అన్‌లిమిటెడ్‌ మీట్‌ కాల్స్‌ను మార్చి 31 వరకు పొడగించింది. దీన్ని గూగుల్‌ వర్క్‌ స్పేస్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా తెలిపింది.

 

కరోనాకు ముందు గంట పాటు ఆన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకునే అవకాశం ఉండేది. లాక్‌డౌన్‌ తర్వాత వర్క్‌ ఫ్రం వినియోగదారులు పెరగడంతో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్‌ పరిమితిని 24 గంటలూ వీడియో కాల్స్, మీటింగ్స్‌ నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. 100 మందిని మీటింగ్‌లో యాడ్‌ చేసే ఆప్షన్‌ ను కూడా అభివృద్ధి చేసింది. ఒకవేళ నూరు కంటే ఎక్కువ మందిని మీటింగ్‌లో యాడ్‌ చేయాల్సి ఉంటే, వినియోగదారులు గూగుల్‌ వర్క్‌ స్పేస్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవలె గూగుల్‌ మీట్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల
యాప్‌ ద్వారా మీటింగ్స్‌లో పాల్గొనే అందరినీ స్మార్ట్‌ ఫోన్‌ లో టైల్‌ వ్యూలో చూసే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం ఐఓఎస్‌ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది. మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.
మొదట గూగుల్‌ ఖాతా ఉన్న వినియోగదారులందరికీ గూగుల్‌ మీట్‌ సేవలను సెప్టెంబర్‌ 30 వరకు ఉచితంగా అందిస్తామని సంస్థ ప్రకటించింది. కానీ, ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా రెండో దశలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ ఆఫర్‌ను పొడగించింది. దీంతో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశాన్ని పొడిగించాయి. అందువల్ల గూగుల్‌ మీట్‌ ఉచిత సేవలను 2021 మార్చి వరకు పొడిగించింది. ప్రస్తుతం మరోసారి ఈ ఉచిత ఆఫర్‌ను జూన్‌ వరకు గూగుల్‌ పొడిగించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news