ఇందనం ధరలకు రెక్కలు వస్తున్నాయి..దాంతో గ్యాస్ కొనాలంటే సామాన్యులకు గుండె భారం అవుతుంది..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇటీవలనే ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.50 మేర పెంచాయి. మార్చి 1 నుంచి ఈ రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. దీంతో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నితాకాయి. దీని వల్ల సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గ్యాస్ బండ గుది బండలా తయారైంది..అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పుదుచ్చేరి ప్రభుత్వం అదిరిపోయే ప్రకటన చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24లో ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొనుగోలుపై తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. సబ్సిడీ రూపంలో ప్రజలకు భారీ డిస్కౌంట్ అందిస్తామని ప్రభుత్వం చెప్పింది..
రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌పై సబ్సిడీ అందిస్తామని పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ అందిస్తామని వెల్లడించింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తానికి వేళ అక్కడి ప్రభుత్వం ఈ మేరకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రటకన చేయడం గమనార్హం. దీని వల్ల ప్రజలకు చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు..
ప్రస్తుతం ధరలు భారీగా పెరిగిపోయాయి..సిలిండర్ ధర రూ. 1150 దాటి పోయింది. ఏపీలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. అంటే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇంటికి రావాలంటే జేబులో నుంచి దాదాపు రూ. 1200 ఖర్చు పెట్టాల్సి వస్తోంది..గ్యాస్ సిలిండర్ ధరల ఒక వైపు పెరగుతూపోతే.. మరో వైపు మోదీ సర్కార్ మాత్రం గ్యాస్ సిలిండర్ సబ్సిడీని కూడా ఎత్తివేసింది. గతంలో సిలిండర్ ధర పెరిగితే అందుకు అనుగుణంగా సబ్సిడీ కూడా పెరిగేది. మన తెలుగు రాష్ట్రాల్లోగ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో కూడా ప్రభుత్వాలు ఇలా గ్యాస్ సిలిండర్ ధరలపై సబ్సిడీ ఇస్తే బాగుండునని జనాలు భావిస్తున్నారు..