అమరనాథ్ యాత్ర తేదీలు ప్రకటించిన ప్రభుత్వం…!

-

ప్రతి ఒక్క హిందువూ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే వాటిలో అమర్ నాథ్ యాత్ర ఒకటి. అక్కడ మంచు లింగ రూపంలో దర్శనం ఇచ్చే శివుణ్ణి దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందాలని అమర్ నాథ్ యాత్రకు సిద్దం అవుతారు. అయితే ఇది అంత సులభమైన యాత్ర కాదు. ఈ యాత్రకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు. అక్కడి వాతావరణ పరిస్థితుల ఆధారంగాను,

మరియు దేశ సరిహద్దులో ఉండటం చేత రక్షణ పరంగానూ కేంద్ర ప్రభుత్వం చేత ఈ యాత్రకు సరైన కాలాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఆ సమయంలో మాత్రమే అమర్ నాథ్ యాత్రకు అనుమతి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం యాత్రకు తక్కువ రోజులున్నాయి. గతేడాది ఈ యాత్ర సమయం 60 రోజులు ఉండగా, ఈ సంవత్సరం మాత్రం 42 రోజులు మాత్రమే కొనసాగుతుంది.

కాశ్మీర్ దక్షిణ హిమాలయాల్లోని ఈ యాత్రను జూన్ 23న ప్రారంభించబోతున్నట్లు అమర్‌నాథ్ ఆలయ ట్రస్ట్ బోర్డ్ ప్రకటించింది.13 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారిని, 75 ఏళ్లు దాటిన వారిని ఈ యాత్రకు అనుమతించరు. యాత్ర మార్గంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించారు. ఈ సారి జూన్ 23వ తేదీన ఈ యాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి యాత్రికులు ఏప్రిల్ 1 నుంచీ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ సారి మరింత ఎక్కువ మందికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news