స్మార్ట్ ఫోన్ పోతే… వాట్సాప్ ఇలా కాపాడుకోండి…!

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో అందులో వినియోగించే వాట్సాప్ కూడా అంతే అవసరం. ఒకరకంగా చెప్పాలి అంటే వాట్సాప్ లేకపోతే స్మార్ట్ ఫోన్ అవసరం లేదనే వారు కూడా మనకు కనపడుతూ ఉంటారు. వ్యక్తిగత, వ్యాపార, రాజకీయ, ఉద్యోగ ఇలా ఎక్కడ చూసినా సరే వాట్సాప్ వాడకం అనేది క్రమంగా పెరిగిపోయింది. వ్యక్తిగత, వ్యాపార, ఉద్యోగ సమాచారం మొత్తం అందులోనే ఉంటుంది. దీనితో వాట్సాప్ చాలా కీలకంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో… వాట్సాప్ భద్రత కూడా చాలా అవసరం.

స్మార్ట్ ఫోన్ ఎక్కడైనా పోయి దానికి పాస్వార్డ్ లేకపోతే మాత్రం వాట్సాప్ లో సమాచారం మొత్తం బయటకు వస్తుంది. వ్యక్తిగత మెసేజులు ఫోన్ తీసుకున్న వారు చూసే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో వాట్సాప్ ని ఏ విధంగా కాపాడుకోవాలి…? ముందుగా మీరు సిమ్ ని బ్లాక్ చెయ్యాలి… దీనితో వాట్సాప్ ని వెరిఫై చేసే అవకాశం వారికి ఉండదు. సిమ్ బ్లాక్ అయిన తర్వాత అదే నెంబర్‌తో వెంటనే మరో సిమ్ కార్డ్ తీసుకొని మీ వాట్సప్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ కొత్త సిమ్‌తో మీ వాట్సప్,

అకౌంట్ యాక్టివేట్ చేయాలని లేకపోతే మాత్రం [email protected] అనే మెయిల్ ఐడీకి మెయిల్ పంపాలి. ‘Lost/stolen: please deactivate my account’ అనే సబ్జెక్ట్‌తో చేయాలి. ఈ మెయిల్ లో మీ మొబైల్ నెంబర్‌ను ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో పేర్కొనాలి. మీ ఫోన్ నెంబర్‌ ముందు +91 తప్పనిసరిగా ఉండాలన్న మాట. అప్పుడు మీ వాట్సప్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. తర్వాత కూడా మీ వాట్సప్ నెంబర్‌కు 30 రోజుల పాటు మెసేజ్‌లు వస్తాయి. అవి అన్ని కూడా పెండింగ్ స్టేటస్‌లో ఉంటాయి కాబట్టి చూడానికి వీలు ఉండదు. ఒకవేళ మీరు మీ అకౌంట్‌ని రీయాక్టివేట్ చేస్తే మీ మెసేజెస్ తిరిగి మీకు వస్తాయి.