ఆధార్ ఉంటే చాలు, పాన్ కార్డ్ వచ్చేస్తుంది…!

-

ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఒక కొత్త వ్యవస్థను రూపొందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు అప్లికేషన్ ఫారమ్ నింపే అవకాశం లేకుండానే పాన్ కార్డును అత్యంత సులభంగా తక్షణమే పొందే వెసులుబాటు ఉంది.

అయితే ఈ విధానం కేవలం… ఆధార్ కార్డుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2020 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై కీలక ప్రకటన చేసారు. పన్ను చెల్లింపుదారుల ఆధార్ ఆధారిత ధృవీకరణను కూడా ప్రవేశపెడుతున్నామని, పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం, ఎటువంటి దరఖాస్తు ఫారమ్ ను నింపాల్సిన అవసరం లేకుండా, ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా పాన్ కార్డును తక్షణమే కేటాయించే వ్యవస్థను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె వివరించారు.

గత సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను దాఖలు కోసం పాన్ కు బదులుగా ఆధార్ కార్డును సమర్పించే సౌకర్యం ఉంది. అయితే, మార్చి 31, 2020 లోపు మీ పాన్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరని ఇప్పటికే ఆదేశాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఎన్ఎస్డీఎల్, యూటీఐ-ఐటీఎస్ఎల్ అనే రెండు ఏజెన్సీల ద్వారా పాన్ కార్డును జారీ చేస్తుంది. ఐటీఆర్ దాఖలు చేయడం, బ్యాంక్ ఖాతాను తెరవడం, ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం వంటి వాటికి ఆధార్ కార్డు కీలకం.

Read more RELATED
Recommended to you

Latest news