Good to Know : వంట గ్యాసు సిలిండర్ కూ బీమా.. ప్రమాదం జరిగితే పరిహారం

-

insurance can be claimed if any gas cylinder accident occurs

మీరు వంట కోసం వాడే గ్యాస్ సిలిండర్ కు బీమా ఉంటుంది. అవును.. దానికి మీరు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. రూపాయి కట్టాల్సిన పని లేకుండా ఉచితంగా బీమా అందిస్తున్నారు వంట గ్యాసుపై. సిలిండర్ వల్ల ప్రమాదం జరిగితే నష్టపరిహారం కూడా ఇస్తారు. కాకపోతే సిలిండర్ ను వాడే చాలామంది కస్టమర్లకు ఈ విషయం తెలియదు. అందుకే.. ఇప్పుడైనా దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం రండి.

గ్యాస్ సిలిండర్ల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టే.. గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీస్ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకు, వారి ప్రాపర్టీలకు థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ను చేపిస్తాయి. దీని కోసం కస్టమర్లు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే ఆటోమెటిక్ గా గ్యాస్ బీమాలో చేరినట్టే.

ప్రమాదం జరిగితే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి

గ్యాస్ సిలిండర్ లీకయి కానీ.. పైప్ లీకయిన కానీ.. గ్యాస్ స్టవ్ లీక్ అయి కానీ.. ఇలా గ్యాస్ సిలిండర్ వల్ల ఎటువంటి ప్రమాదం జరిగినా.. వెంటనే సంబంధిత గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ఆఫీసుకు తెలియజేయాలి. వాళ్లు ప్రమాదం ఎలా జరిగింది… దానికి సంబంధించిన వివరాలను సేకరిస్తారు. ఆ వివరాలను గ్యాస్ కంపెనీని పంపిస్తారు. ఒకవేళ గ్యాస్ ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి డెత్ సర్టిఫికెట్, పోస్ట్ మార్టమ్ రిపోర్టు.. ఎవరైనా గాయపడితే.. చికిత్స తీసుకున్న వివరాలు, బిల్లు జత చేసి కంపెనీకి సమర్పించాలి. అప్పుడు కంపెనీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. బీమా కంపెనీకి సదరు కస్టమర్ కు బీమా చెల్లించాలని ఆదేశిస్తుంది. దీంతో బీమా కంపెనీకి ఆయిల్ కంపెనీకి నష్టపరిహారం ఇస్తుంది. ఆయిల్ కంపెనీ… లోకల్ ఆఫీసుకు అందిస్తుంది. లోకల్ ఆఫీసు నుంచి సదరు కస్టమర్ కు నష్ట పరిహారం చేరుతుంది.

ఎంత నష్ట పరిహారం చెల్లిస్తారు

సిలిండర్ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తారు. గాయపడితే… ట్రీట్ మెంట్ కోసం లక్ష వరకు చెల్లిస్తారు. గాయపడిన వాళ్లకు వైద్యం కోసం తక్షణ సాయం కింది 25 వేల రూపాయలు చెల్లిస్తారు. ఇక.. సిలిండర్ ప్రమాదం వల్ల ఏదైనా ఆస్తి నష్టం వాటిల్లితే దానికి కూడా లక్ష వరకు సాయం అందిస్తారు. కాకపోతే.. ఇక్కడే ఓ తిరకాసు ఉంది. నష్ట పరిహారం అనగానే వెంటనే వచ్చేయదు. దానికి చాలా రూల్స్ ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ కోసం ఇచ్చిన అడ్రస్ లో ఏదైనా ప్రమాదం జరిగితేనే బీమాను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. సిలిండర్ లో ఏదైనా లోపం వల్ల ప్రమాదం జరిగితేనే క్లయిమ్ చేస్తారు. కావాలని సిలిండర్ గ్యాస్ ను లీక్ చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, ఏవైనా ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన ప్రమాదాలకు బీమాను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు.

ఉప‌యోగ‌క‌ర‌మైన‌ ఈ స‌మాచారాన్ని మీ స్నేహితుల‌తో, స‌న్నిహితుల‌తో షేర్ చేయండి..

Read more RELATED
Recommended to you

Latest news