ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో వడ్డీ లేకుండా లోన్…!

-

చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడుతూ వుంటారు. అయితే ఈ క్రెడిట్ కనుక ఉంటే వడ్డీ లేకుండా లోన్ తీసుకొచ్చు. ప్రైవేట్ రంగానికి చెందిన ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ సౌకర్యాన్ని కలిగిస్తోంది. తన క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు 48 రోజుల పాటు వడ్డీ రహిత నగదును అందిస్తోంది ఐడిఎఫ్సీ బ్యాంక్. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

money
money

మాములుగా అయితే క్రెడిట్ కార్డుల నుండి నగదు ఉపసంహరించుకోవడంపై వడ్డీ చెల్లించాలి. ప్రతీ ఒక ట్రాన్సక్షన్ మీద బ్యాంకులు రూ. 250 నుండి 450 వరకు వసూలు చేయడం జరుగుతుంది. అలానే అదనంగా నెలవారీ వడ్డీ చెల్లించాలి. ఇది ఇలా ఉంటే IDFC క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు నగదు లావాదేవీలపై రూ.250 డొమెస్టిక్ క్యాష్ అడ్వాన్స్ ఫీజు మాత్రమే వసూలు చేయడం జరుగుతోంది.

అలానే FIRST Millennia Credit Card, FIRST Classic Credit Card, FIRST Select Credit Card, FIRST Wealth Credit Card వంటివి లక్ష్యంగా చేసుకుంది. అయితే వీటి అన్నింటిలో కూడా ఒకేలాంటి సౌకర్యాన్ని పొందొచ్చు. ఇక ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది చూస్తే.. అన్ని ఆన్‌లైన్ ఖర్చులపై 6X రివార్డ్ పాయింట్‌లు పొందొచ్చు. రివార్డ్ రేటు – 1.5%. అలానే అన్ని ఆఫ్‌లైన్ ఖర్చులపై 3X రివార్డ్ పాయింట్‌లు. రివార్డ్ రేటు – 0.75 శాతం.

అలానే బర్త్‌డేలో ఖర్చు చేసే మొత్తం మీద 10X రివార్డ్ పాయింట్‌లు. రివార్డ్ రేట్ – 2.5 శాతం. అదే విధంగా ఒక నెలలో 20 వేల రూపాయల కంటే ఎక్కువ అన్ని ఖర్చులపై 10X రివార్డ్ పాయింట్లు. రివార్డ్ రేటు- 2.5 శాతం. ఇంధనం, EMI, బీమా లావాదేవీలు పై రివార్డ్ లేదు. ఒక రివార్డ్ పాయింట్ విలువ 25 పైసలకు సమానం. అలానే రివార్డ్ పాయింట్‌లపై ఎటువంటి పరిమితులు లేవు. మీరు ఒక బిల్లింగ్ సైకిల్‌లో అపరిమిత రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news