ఎల్‌ఐసీ హౌసింగ్‌ బంపర్‌ ఆఫర్‌

-

ఎల్‌ఐసీ హౌసింగ్‌ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వారికి 6 నెలల ఈఎంఐల నుంచి మినహాయింపు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఇల్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి బ్యాంకులు తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి. ఇప్పుడు తాజాగా ఎల్‌ఐసీ ఫైనాన్స్‌ కూడా తమ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వారికి 6 నెలలకు సమానమైన గృహ రుణాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సంస్థే స్వయంగా ప్రకటించింది. ఇది నెలవారీ జీతాలు తీసుకునే ఉద్యోగులతో పాటు డీబీపీ (డిఫైన్డ్‌ బెనిఫిట్‌ పెన్షన్‌) స్కీం పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు సైతం వర్తిస్తుంది.

ఈ సరికొత్త ఆఫర్‌ ప్రకారం 37,38,73,74,121,122 ఈఎంఐల నుంచి మిన హాయింపు లభిస్తుంది. ఒక నెల ఈఎంఐని తరువాతి నెల ప్రిన్సిపల్‌కు కలిపిన మొత్తాన్ని రద్దు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డీబీఎం రిటైర్డ్‌ ఉద్యోగులు, పీఎస్‌యూ బ్యాంక్, డిఫెన్స్‌ ఉద్యోగులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ స్కీముకు దరఖాస్తు చేసుకునేవారి గరిష్ట వయసు 65 ఏళ్లు ఉండవచ్చు. వినియోగదారులకు 80 ఏళ్లు వచ్చే వరకు లోన్‌ గడువు 30 ఏళ్ల వరకు ఏది ముందైతే అంత వరకు లోన్‌ గడువు ఉంటుంది.
ఈ పథకాన్ని గత ఏడాది ప్రారంభించారు. నాటి నుంచే ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తుందని సంస్థతెలిపింది. ఇది మార్కెట్లో ఉన్న వేరే గృహ రుణాలకు ఇది భిన్నంగా ఉంటుంది.
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇప్పటి వరకు 15 వేల గృహ రుణాలను అందించింది. వీటి విలువ రూ.3,000 కోట్ల వరకు ఉంటుంది. సిబిల్‌ స్కోరు 700, అంతకంటే ఎక్కువ ఉన్న అర్హులకు ఈ పథకం ద్వారా 6.9 శాతం ప్రారంభ వడ్డీతో రూ.15 కోట్ల వరకు హోమ్‌ లోన్లు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత సమయంలో గృహ రుణాలు తీసుకునే వారికి ఈ ఎల్‌ఐసీ పథకం బాగా ఉపయోగపడుతుంది. ఆరు నెలల ఈఎంఐ ని మినహాయించడం ద్వారా కస్టమర్లకు ఇది ఒక విధంగా భారీ ఊరటే.

Read more RELATED
Recommended to you

Latest news