Credit Card వాడుతున్నారా.. జనవరి 1 నుంచి చార్జీల బాదుడు !

-

కొత్త ఏడాది నుంచి క్రెడిట్ కార్డు కలిగిన వారికి షాక్ తగలనుంది. చార్జీల బాదుడు ప్రారంభం కానుంది. అయితే ఇది అందరికీ కాదు. కేవలం ఒక బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ బ్యాంక్ దారిలో ఇతర బ్యాంకులు కూడా నడిస్తే.. అప్పుడు అందరికీ పెనాల్టీల మోత తప్పుదు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారు నిర్ణీత తేదీలోపు బిల్లు మొత్తాన్ని చెల్లించకపోతే ఇంకా ఎక్కువ వడ్డీ మొత్తం పెనాల్టీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయం 2020 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. సిటీ బ్యాంక్ ఇండియా ఇప్పటికే తన సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు యూజర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది. బ్యాంక్‌కు సంబంధించిన ఇతర క్రెడిట్ కార్డుదారులకు కూడా ఇది వర్తించే అవకాశముంది. ఇకపోతే క్రెడిట్ కార్డు కలిగినవారు డ్యూడేట్ లోపు కార్డు బిల్లు మొత్తంలో కనీసం 5 శాతం చెల్లించాలి. లేదంటే పెనాల్టీల బాదుడు మొదలవుతుంది. పెనాల్టీ రూ.500 వరకు ఉంటుంది. దీనికి జీఎస్‌టీ అదనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version