యువ రచయితల కోసం ప్రధానమంత్రి మెంటరింగ్‌ స్కీం!

యువ రచయితల కోసం ప్రధానమంత్రి మెంటరింగ్‌ యువ స్కీమ్‌ (YUVA Scheme)ను ప్రారంభించింది కేంద్రం. ఈ స్కీం ద్వారా రూ. 3 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం ఉంటుంది. అయితే, దీనికి దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. జూన్‌ 4 నే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోటీ ప్రారంభమైంది. ఆసక్తిగల యువ రచయితలు ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు.

యువ రచయితలను గుర్తించేందుకు పీఎం మెంటరింగ్‌ యువ స్కీమ్‌ ప్రారంభమైంది. యువ రచయితల కోసం రూపొందించిన మార్గదర్శక స్కీం ఇది. యువ మనస్సులను శక్తివంతం చేయడం, భవిష్యత్‌ నాయకత్వ పాత్రల కోసం యువ అభ్యాసకులను పెంపొందించడంతో పాటు భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అర్హులైన యువ రచయితలు ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ పోటీ జూలై 31తో ముగుస్తుంది. భారత్‌ దేశ వ్యాప్తంగా ఈ పోటీ ద్వారా మొత్తం 75 మంది రచయితలను ఎంపిక చేస్తారు. పోటీలో పాల్గొనడానికి mygov.in సందర్శించండి. యువ రచయితల కల్పన, నాన్‌–ఫిక్షన్, డ్రామా, కవిత్వం వంటి వివిధ శైలిలో రాయడంలో నైపుణ్యం సాధిస్తారు.

అందులో ’ఇన్నోవేట్‌ ఇండియా’ విభాగానికి వెళ్లాలి. Innovateindia.mygov.in/yuva/ పై క్లిక్‌ చేయడం ద్వారా yuva పోర్టల్‌కు వెళ్లొచ్చు.   పేజీ ఎడమ వైపున, ’ఇక్కడ క్లిక్‌ చేయడానికి సమర్పించు’ అని చదివే బటన్‌ పై క్లిక్‌ చేయాలి. లాగిన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అప్పుడు అవసరమైన వివరాలను నమోదు చేయాలి. అక్కడి వచ్చిన ఐడీ పాస్‌వర్డ్‌తో సైన్‌ ఇన్‌ చేయాలి. కొనసాగండి, ఫారమ్‌ నింపండి క్లిక్‌ చేయాలి.
దరఖాస్తు చేయడానికి అక్కడ డైరెక్ట్‌ లింక్‌ ఉంటుంది. పోటీదారులు 30 ఏళ్లలోపు ఉండాలి. మెంటర్‌షిప్‌ పథకం కింద సరైన పుస్తకంగా డెవలప్‌మెంట్‌ చెందేలా 5,000 పదాల మనుస్క్రిప్ట్‌ సమర్పించాలి. నేషనల్‌ బుక్స్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసే కమిటీ ఈ ఎంపిక చేస్తుంది. ఆగస్టు 15, 2021 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన రచయితల పేర్లు ప్రకటిస్తారు.