కొన్ని రకాల వస్తువులను మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు ఏ విధంగా ఆరోగ్యం, ఐశ్వర్యం కలసి వస్తాయో.. అలాగే కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉంటే వాటి ద్వారా మనకు అన్నీ అశుభాలే కలుగుతాయి. మూఢ నమ్మకం అనుకోకుండా కింద తెలిపిన పలు వస్తువులు గనక మీ ఇంట్లో ఉంటే వాటిని వెంటనే తీసేయెండి. ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండరాదు. ఉంటే మీకు అశుభాలే ఎదురవుతాయట. మరి ఇంట్లో ఉంచుకోకూడని ఆ వస్తువులు ఏమిటంటే…
1. రాకింగ్ చెయిర్
మనం అనేక దెయ్యం సినిమాల్లో చూసుంటాం. దెయ్యం ఇంట్లో ఉందని చెప్పడాన్ని సూచించేలా వాలు కుర్చీ ఎప్పుడూ ముందుకు, వెనుకకు ఊగుతూ ఉంటుంది. అవును, నిజానికి ఈ కుర్చీని అసలు ఇండ్లలో పెట్టుకోకూడదట. ఈ కుర్చీలు ఇంట్లో ఉంటే దెయ్యాలకు స్వాగతం పలికినట్లు అవుతుందట. దీని వల్ల అంతా చెడు జరుగుతుందని ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది. కనుక ఈ తరహా కుర్చీలు గనక మీ ఇండ్లలో ఉంటే వెంటనే తీసేయండి.
2. ఆకుపచ్చ రంగు
ఆకుపచ్చ రంగును ఇండ్లలో గోడలకు వేయరాదు. ఈ రంగు అశుభాలను కలిగిస్తుందని నమ్ముతారు. కనుక ఇంట్లో గోడలకు ఈ రంగు కాకుండా ఇతర ఏ రంగునైనా వేయించాలి.
3. పగిలిన గడియారాలు
ఇండ్లలో పగిలిన గడియారాలను ఉంచుకోకూడదని ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది. వీటి వల్ల ఇంట్లో ఉండే వారు ప్రమాదాల బారిన పడడమో, మరణించడమో జరుగుతుందట. కనుక పగిలిన గడియారాలు ఉంటే వెంటనే ఇంటి నుంచి తీసేసి బయట పారేయండి.
4. మొక్కలు
బ్రహ్మజెముడు, నాగజెముడు జాతికి చెందిన కాక్టి మొక్కలను ఇండ్లలో పెంచుకోరాదు. ఇవి అశుభాలను కలిగిస్తాయని ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది. కనుక ఈ మొక్కలను కూడా ఇంటి నుంచి తీసేయాలి.
5. బెడ్
ఉదయం నిద్ర నుంచి లేవగానే బెడ్‌ను సర్దుకోవాలి. లేదంటే అరిష్టం వస్తుందట. ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం.. సరిగ్గా సర్దని బెడ్ అన్నీ అశుభాలనే కలిగిస్తుందట.
6. గొడుగు
గొడుగులను ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో ఉండే గొడుగులను మాత్రం ఎప్పుడూ మూసే ఉంచాలి. తెరవకూడదు. అలా తెరిస్తే ఫెంగ్‌షుయ్ వాస్తు ప్రకారం అశుభాలు కలుగుతాయట.
7. ఎండిపోయిన మొక్కలు
ఇంటి లోపల పెంచుకునే మొక్కలు ఎండిపోరాదు. వాడిపోరాదు. అవి ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఎండిపోతే ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం ఇంట్లో ఎవరికైనా కీడు జరగబోతుందని తెలుసుకోవాలి. కనుక మొక్కలను ఎప్పుడూ పచ్చగా ఉంచాలి.