అదిరే స్కీమ్.. భార్యాభర్తలకు నెల నెలా రూ.10 వేలు..!

కేంద్రం ప్రజల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన ప్రజలకి లాభదాయకంగా ఉంటుంది. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ నెలా డబ్బులని పొందొచ్చు. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

money
money

అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది పెన్షన్ స్కీమ్. దీనిలో ప్రతి నెలా డబ్బులు చేతికి లభిస్తాయి. కానీ 60 ఏళ్లు దాటిన తర్వాతనే. ఇక ఈ స్కీమ్ లో ఎవరు చేరచ్చు అనేది చూస్తే.. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు చేరొచ్చు.

ఈ స్కీమ్ నుండి డబ్బులు పొందాలి అంటే ప్రతి నెలా కొంత డబ్బులు కడుతూ వెళ్లాలి. 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే మీరు అప్పుడు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో జాయిన్ అవ్వొచ్చు. ఎంత పెన్షన్ వస్తుంది అనేది ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది గమనించండి. రూ.1000, రూ.2 వేలు, రూ.3000, రూ.4 వేలు, రూ.5000 వరకు పెన్షన్ పొందొచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది.

రూ.1000కు అయితే రూ.42, రూ.2 వేలకు రూ.84, రూ.3 వేలకు రూ.126, రూ.4 వేలకు రూ.168 కట్టాలి. 20 ఏళ్ల వయసులో భార్యభర్తలిద్దరూ ఇందులో చేరితే నెలకు రూ.500 చెల్లించడం ద్వారా ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ పొందొచ్చు. భార్యకు రూ.5 వేలు, భర్తకు రూ.5 వేలు. దీనికి భార్య రూ.248, భర్త రూ.248 కట్టాలి.