అదిరే LIC పాలసీ.. రూ.150తో చేతికి రూ.10 లక్షలు..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల బెనిఫిట్స్ ని అందిస్తోంది. అలానే చాలా రకాల పాలసీలని కూడా ఇస్తోంది. వాటిలో ధన్ రేఖ పాలసీ కూడా ఒకటి. దీని వలన లాభాలు ఎక్కువగా వున్నాయి. మెచ్యూరిటీ సమయంలో కూడా ఒకేసారి భారీ మొత్తం అందుతుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పాలసీని కనీసం రూ.2 లక్షల మొత్తానికి తీసుకొచ్చు. ఎలాంటి లిమిట్ లేదు.

LIC
LIC

ఈ పాలసీకి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. 90 రోజుల వయసు ఉన్న చిన్న పిల్లల నుండి 55 ఏళ్ల వయసు ఉన్న వారు పాలసీ తీసుకోవడానికి అర్హులు. 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల పాలసీ టర్మ్‌తో ధన్ రేఖ పాలసీ తీసుకోచ్చు. మీరు ఎంచుకున్న టర్మ్ ప్రాతిపదికన మీరు ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంది. 20 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే పదేళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి.

అదే 30 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ 40 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంపిక చేసుకుంటే 20 ఏళ్లు ప్రీమియం పే చేయాలి. సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఒకేసారి డబ్బులు కడితే సరిపోతుంది. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివీజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. థర్డ్ జెండర్ వాళ్లు తీసుకోచ్చు. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు వర్తిస్తాయి.

డబ్బులుకి ఎలాంటి రిస్క్ ఉంటుంది. 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే పాలసీ తీసుకున్న పదో ఏటా, 15 ఏటా బీమా మొత్తంలో 10 శాతం డబ్బులు చెల్లించాలి. 30 ఏళ్ల టర్మ్ అయితే 15వ ఏటా, 20వ ఏటా, 25వ ఏటా బీమా మొత్తంలో 15 శాతం ఇస్తారు. 40 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 20వ ఏటా, 25వ ఏటా, 30వ ఏటా, 35వ ఏటా బీమా మొత్తంలో 20 శాతం చెల్లిస్తారు.

28 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 20 ఏళ్లు. ఇప్పుడు వీరికి మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.9 లక్షలు లభిస్తాయి. 10, 15 సంవత్సరాల్లో చేతికి రూ.50 వేల చొప్పున రూ.లక్ష వస్తాయి. అంటే మొత్తంగా పాలసీ ద్వారా రూ.10 లక్షలు లభిస్తాయి. నెలకు రూ.4500 వరకు ప్రీమియం కట్టాలి. అంటే రోజుకు రూ.150 పొదుపు చేస్తే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news