రైతులకి ఎన్నో రకాల స్కీమ్స్ వున్నాయి. వాటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ తో రైతులకి ఆర్ధికంగా హెల్ప్ అవుతుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 10వ విడత దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు అందింది. అయితే డబ్బులు అందకపోతే ఫిర్యాదు చెయ్యచ్చు.
అది కూడా ఎంతో సులభంగానే. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. 10వ విడత దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు జమ అయ్యింది. అయితే ఇంతవరకు వాయిదా డబ్బులు అందని రైతులు కొందరు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా కంప్లైంట్ చెయ్యచ్చు. ఈజీగా రైతులు ప్రభుత్వం జారీ చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
లేదు అంటే మీరు ప్రాంతంలోని అకౌంటెంట్, వ్యవసాయ అధికారిని కూడా అడగొచ్చు. కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అందకపోయినట్టైతే మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
మీరు హెల్ప్‌లైన్ నంబర్ 011 24300606 / 011 23381092కు కాల్ చేయవచ్చు. అలాగే సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రధానమంత్రి రైతులు హెల్ప్ డెస్క్, ఈ-మెయిల్ pmkisan ict@gov.inని సంప్రదించవచ్చు. ఒక్కో సరి చిన్న చిన్న పొరపాట్ల వలన డబ్బులు పడవు. మీ ఆధార్, ఖాతా నంబర్ బ్యాంక్ ఖాతా నంబర్‌లో పొరపాట్లు ఉండడం కానీ తేడా ఉండడం వలన కానీ డబ్బులు పడవు.