ఆ ఐదు బీమా పాలసీలు అవసరమే..!

-

అకస్మాతుగా జరిగే ప్రమాదాలతో కలిగే నష్టాల నుంచి బీమాలు ఊరటనిస్తాయి. ఇళ్లకు రక్షణగా గృహ
బీమా, ఆరోగ్యబీమాలతో పాటు తదితర పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యుల సౌకర్యార్థం టర్మ్‌బీమా, వీటంనింటితో పాటు ప్రస్తుతం సైబర్‌బీమా కూడా అందుబాటులోకి వచ్చింది.

1. టర్మ్‌బీమా..

మన కుటుంబ సభ్యుల కోసం టర్మ్‌బీమా చాలా ఉపయోగపడుతోంది. వార్షిక ఆదాయానికి కనీసం 15 రెట్లు బీమా హామీ ఉండేలా టర్మ్‌పాలసీ తీసుకోవాలి. ఈ బీమాకు ప్రీమియం కూడా తక్కువగా ఉండి, జరగరానిది జరిగితే ఈ హామీ మొత్తం సంబంధిత కుటుంబానికే చెందుతుంది.

2. ప్రమాదబీమా..

నేటి సమాజంలో ఇంటినుంచి బయటకి వెళితే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కుర్రకారు నుంచి వద్ధుల వరకు వాహనాలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎదుటివారి పొరపాటుతో మనకు నష్టం వాటిల్లే పరిస్థితులు వస్తాయి. పెద్ద ప్రమాదం జరిగితే అంగవైకల్యానికి గురి కావొచ్చు. ఈ ప్రభావం మన కుటుంబం మొత్తం మీదా చూపుతుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ బీమాతో రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రమాదవశాత్తూ మరణం, పాక్షిక వైకల్యం లాంటి పాలసీలు తీసుకుంటే ఆస్పత్రి అయ్యే ఖర్చులన్నీ పొందవచ్చు.

3. గృహబీమా..

కొత్తింటి నిర్మాణం, కొనుగోలు చేయడంతో చాలా మంది ఆర్థికపరంగా సుస్థిరతను పొందుతారు. మున్ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటామో ముందుగా తెలియదు కాబట్టి గృహబీమా తీసుకోవాలి. మానవ చర్యలు, సహజసిద్ధంగా ఏర్పాడే ఘటనలను కవర్‌చేసే పాలసీలు తీసుకోవడంతో ఇంటికి భద్రత కల్పించిన వారవుతారు. అంతేకాక ఇంట్లో ఉండే విలువైన సామగ్రికి కూడా కంటెంట్‌ కవర్‌బీమా తీసుకుంటే వాటికి కూడా బీమా వర్తిస్తుంది.

4. ఆరోగ్యబీమా..

ప్రతి ఏడాది వివిధ కారణాలు, జబ్బుల కారణంగా దాదాపుగా 20 శాతం ఆస్పత్రి ఖర్చులు పెరుగుతాయి. అందుకు ఆరోగ్యానికి సంబం«ధించిన బేస్‌ పాలసీతో పాటు, హామీ మొత్తం పెంచుకునేలా టాప్‌–అప్‌ పాలసీ తీసుకుంటే ఇంకా మంచిది. దీంతో ఎక్కువ కవరేజీతో పాటు క్రిటికల్‌ ఇన్‌నెస్‌ కవరేజీ కూడా అదనంగా పొందవచ్చు.

5. Cyber insurance..

ప్రస్తుత కాలంలో చాలా సమయంలో ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. దీంతో వారి విలువైన సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలాంటి సైబర్‌ నేరాలను అరికట్టేందుకు సైబర్‌బీమా ఎంతో ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news