ఒక్క అంకె మారినా.. మీ పైసలు గోవిందా…!

-

ఒకవేళ వేరే ఖాతాలోకి డబ్బు వెళ్లిపోతే ఎలా? అప్పుడు ఏం చేయాలి? మళ్లీ నగదు వెనక్కి తెచ్చుకోవాలంటే ఎటువంటి నిబంధనలు పాటించాలి? వేరే అకౌంట్ లో డబ్బులు జమ అయినప్పుడు.. ఆ ఖాతాదారుడు ఆ డబ్బులను బ్యాంక్ కు తీసుకువెళ్లి ఇవ్వాలా? లేక వాళ్లే ఉంచేసుకోవాలా?

ఇదంతా టెక్నాలజీ యుగం కదా. ఈరోజుల్లో ఏ పని చేయాలన్నా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. కరెంట్ బిల్లుల దగ్గర్నుంచి… చివరకు ఫుడ్డు ఆర్డర్ చేసుకోవాలన్నా ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ప్రపంచమే మన ముంగిట ఉంటుంది. ఇదివరకులా బ్యాంకులకు వెళ్లి గంటలు గంటలు లైన్ లో నిలబడాల్సిన పని కూడా లేదు. స్మార్ట్ ఫోన్ తో చిటికెల బ్యాంకుకు సంబంధించిన ఏ లావాదేవీని అయినా పూర్తి చేయొచ్చు.

Tips for safe and internet banking

అయితే.. ఆన్ లైన్ లో బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు టెక్నాలజీ నిపుణులు. కొంచెం అటు ఇటు అయినా లావాదేవీల్లో చాలా తప్పులు జరిగిపోతాయని చెబుతున్నారు. ఉదాహరణకు.. వేరే బ్యాంక్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడానికి నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ పద్ధతులు ఉపయోగిస్తారు కదా. ఆ పద్ధతుల్లో డబ్బులు పంపించేటప్పుడు ఒకటికి పదిసార్లు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని పంపిచాలని చెబుతున్నారు. ఒక్క అంకె మారినా… ఒక్క అంకె తప్పు పడినా… డబ్బులు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ అవుతాయని.. దీని వల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఒకవేళ వేరే ఖాతాలోకి డబ్బు వెళ్లిపోతే ఎలా? అప్పుడు ఏం చేయాలి? మళ్లీ నగదు వెనక్కి తెచ్చుకోవాలంటే ఎటువంటి నిబంధనలు పాటించాలి? వేరే అకౌంట్ లో డబ్బులు జమ అయినప్పుడు.. ఆ ఖాతాదారుడు ఆ డబ్బులను బ్యాంక్ కు తీసుకువెళ్లి ఇవ్వాలా? లేక వాళ్లే ఉంచేసుకోవాలా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..

అకౌంట్ నెంబరే కీలకం..

ఎవరికైనా డబ్బులు పంపించాలనుకుంటే.. వారి అకౌంట్ నెంబర్ నే ఏ బ్యాంకులైనా ప్రామాణికంగా తీసుకుంటాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పంపిస్తున్నప్పుడు అకౌంట్ నెంబర్, పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచ్ నేమ్ లాంటివన్నీ ఉండాలని అనుకుంటారు. కానీ.. నగదు బదిలీకి అకౌంట్ నెంబర్ మినహా.. మిగితావేవీ ప్రామాణికం కాదు. అవును.. మీరు అకౌంట్ నెంబర్ ఒకటి కరెక్ట్ గా కొడితే చాలు.. మిగితా వివరాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా నగదు ట్రాన్స్ ఫర్ అవుతుంది. కానీ.. మీరు అకౌంట్ నెంబర్ ను తప్పుగా కొట్టి.. మిగితావన్నీ కరెక్ట్ గా కొట్టినా ఉపయోగం ఉండదు. డబ్బులు వేరే అకౌంట్ లోకి బదిలీ అవుతాయి. ఒక్కోసారి ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా ఇచ్చినా ట్రాన్జాక్షన్ ఫెయిల్ అవుతుంది.

వేరే ఖాతాలోకి నగదు బదిలీ అయితే ఏం చేయాలి?

పొరపాటున కానీ.. కావాలని కానీ.. వేరే ఖాతాలోకి నగదు బదిలీ చేస్తే.. వెంటనే మీ బ్యాంకు బ్రాంచీని సంప్రదించండి. బ్యాంక్ సిబ్బంది అవతలి ఖాతాదారుడి బ్యాంక్ సిబ్బందితో మాట్లాడతారు. కుదిరితో అవతలి ఖాతాదారుడితోనే మాట్లాడి జరిగిన తప్పిదాన్ని చెబుతారు. పొరపాటుగా జమ అయిన డబ్బులను వెనక్కి తీసుకునేందుకు అనుమతిని కోరతారు. వారు ఓకే అంటే సమస్య అక్కడికక్కడే పరిష్కారం అయినట్టే. వాళ్లు నో అంటే..

కోర్టులో తేల్చుకోవడమే..

పొరపాటున నగదు వేరే ఖాతాలోకి బదిలీ అయితే.. ఆ ఖాతాదారు డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేయడానికి నో అంటే.. అప్పుడు మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. కాకపోతే మీ తప్పిదం కారణంగానే మీరు ఆ ఖాతాదారుడిని కోర్టుకు రప్పిస్తున్నట్టు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయస్థానం ఆ ఖాతాదారుడికి పొరపాటుగా జమైన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని సూచిస్తుంది. అప్పటికీ ఆ ఖాతాదారుడు వినకపోతే దాన్ని క్రిమినల్ కేసుగా పరిగణిస్తారు. ఆ కేసు కింద అతడిని బుక్ చేసి 6 నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

ఒకవేళ మీ ఖాతాలోనే జమ అయితే..

పొరపాటున డబ్బులు మీ ఖాతాలోకి వస్తే ఆ డబ్బులు మీరు అసలైన ఖాతాదారుడికి తిరిగి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ.. వాళ్లు కోర్టును ఆశ్రయిస్తే మాత్రం అప్పుడు సమాధానం చెప్పాల్సిందే. డబ్బులు ఎలా జమయ్యాయో.. ఎవరు జమ చేశారో నిరూపించాలి. ఒకవేళ సరైన ఆధారాలు సమర్పించలేకపోతే కోర్టు తీసుకునే చర్యలకు బాధ్యులవ్వాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news