ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. నేపథ్యంలోనే నిన్న ఉక్రెయిన్ లో భారత విద్యార్థి నవీన్ మృతి చెందారు. రష్యా జరిపిన దాడిలో నవీన్ మరణించాడు. ఈ విషయాన్ని భారతీయ విదేశాంగ శాఖ అధికారికంగానే ధ్రువీకరించింది. రష్యన్ ఆర్మీ ఖర్కీవ్ నగరంపై రష్యా జరిపిన దాడి సమయంలో నవీన్ మరణించారు.
నవీన్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అయితే.. నవీన్ కుమార్ మరణంపై అతని తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. మెడిసిన్ సీటు కోసం..ఇండియాలో కోట్లు అడిగారని..అందుకే ఉక్రెయిన్ పంపానంటూ నవీన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంటర్ లో 97% మార్కులు తెచ్చుకున్నప్పటికీ, తన కొడుకు కర్ణాటక రాష్ట్రంలో మెడికల్ సీటు సాధించలేకపోయాడని… మెడికల్ సీటు పొందాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కాలేజీలు డిమాండ్ చేశాయని పేర్కొన్నారు. విద్యార్థులు తక్కువ డబ్బుతో విదేశాల్లో అదే విద్యను అభ్యసిస్తున్నారని.. ఈ నేపథ్యంలో తన కొడుకును ఉక్రెయిన్ కు పంపానని నవీన్ శేఖరప్ప తండ్రి చెప్పారు. కానీ ఈ యుద్ధం కారణంగా తన కొడుకు మృతి చెందుతాడని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Despite scoring 97% in PUC, my son could not secure a medical seat in State. To get a medical seat one has to give crores of rupees&students are getting same education abroad spending less money, says father of Naveen Shekharappa, an Indian student who died in shelling in Ukraine pic.twitter.com/wXqArRW9eq
— ANI (@ANI) March 1, 2022