తెలుగు రాష్ట్రాల ఉద్యోగుల బదిలీలపై మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

-

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోయినా మండలిలో మాత్రం ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు.

ఉద్యోగుల బదీలీలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.అధికారుల తాజా నివేదిక ప్రకారం మొత్తం 1,942 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అదేవిధంగా 1,447 మంది తెలంగాణలోని ఉద్యోగులు ఏపీకి రావాలనుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగుల వన్‌టైమ్ రిలీవ్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు. తెలంగాణ నుంచి సమాధానం రావాల్సి ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news