రైతులను వంచించిన కాంగ్రెస్.. రూ.1000 నష్టానికి పత్తి పంట అమ్మకం : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు వంచనకు గురయ్యారని, వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం పర్యటనలో భాగంగా పత్తి కొనుగోలు మార్కెట్‌ను సందర్శించి అక్కడి రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా నాయకులు ఉన్నారు.

ఈ సందర్బంగా హరీశ రావు మాట్లాడుతూ.. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మాట తప్పిందని, కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందుతుందన్నారు.అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని మండపడ్డారు.రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, మద్దతు ధర లేక రూ.1000 నష్టానికి రైతులు పంట అమ్ముకుంటున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news