రాబోయే తరం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే. ఈ విషయాన్ని ఇప్పటికే మేధావులు, టెక్ నిపుణులు కుండబద్దలు కొట్టారు. ఏఐ రాకతో ఇకపై హార్డ్ వర్క్ అంటూ ఏం ఉండదు. అంతా స్మార్ట్ వర్కే.. ఆ స్కిల్స్ ఉన్నవారికే భవిష్యత్‌లో ఉద్యోగాలు. స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే పోటీ ప్రపంచం నుంచి తప్పుకోవాల్సిందేనని ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరులు ఇప్పటికే స్పష్టంచేశారు.
తాజాగా AI ఒక అద్భుతం చేసింది.విద్యార్థి హ్యాండ్ రైటింగ్‌తో హోం వర్క్ ఫినిష్ చేసింది. కేరళకు చెందిన ఓ విద్యార్థి ఆ అద్భుతం చేసి చూపించాడు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి.. తన హ్యాండ్ రైటింగ్‌తో రాసే మెషిన్‌ను రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.విద్యార్థి తెలివితేటలకు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
AI అద్భుతం.. విద్యార్థి హ్యాండ్ రైటింగ్ తో హోం వర్క్..
కేరళకు చెందిన ఓ విద్యార్థి అద్భుతం సృష్టించాడు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి.. తన హ్యాండ్ రైటింగ్ తో రాసే మెషిన్ ను రూపొందించాడు
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది
విద్యార్థి తెలివితేటలకు… pic.twitter.com/IUtn9J68gr
— BIG TV Breaking News (@bigtvtelugu) November 23, 2024