ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై జగదీశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !

-

ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మాకు అనుమానాలు ఉన్నాయని బాంబ్‌ పేల్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఫేక్ ఎన్‌కౌంటర్లు ఎప్పటికైనా తప్పే.. గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్‌కౌంటర్లకు ఒప్పుకోలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.

Jagadishwar Reddy’s sensational comments on Maoist encounter in Ethurunagaram

మా ఆదివాసీలను ఎక్కువగా చంపుతున్నారని దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయని దానిపై కోర్టులో వేశామని తెలిపారు.. ఆదివాసి హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారని వివరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితిలో ఎన్‌కౌంటర్ ఫేక్ అయితే మాత్రం తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 14 ఎన్‌కౌంటర్లు జరిగాయి.. వాటిపై ఎవరికి అనుమానాలు ఉన్నా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news