పొట్టి శ్రీరాములు పేరు మార్చడం సరికాదు..రేవంత్‌పై టీజీ. వెంకటేష్ సీరియస్ !

-

రేవంత్‌పై టీజీ. వెంకటేష్ సీరియస్ అయ్యారు. పొట్టి శ్రీరాములు పేరు మార్చడం సరికాదంటూ రేవంత్‌పై టీజీ. వెంకటేష్ మండిపడ్డడారు. కర్నూలులో ఇవాళ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌పై టీజీ. వెంకటేష్ సీరియస్ అయ్యారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములుకు తెలంగాణ లో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ ఆగ్రహించారు.

tg venkatesh condolences to potti sriramulu

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో పొట్టి శ్రీరాములుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు టీజీ. వెంకటేష్. ఏపీలో సీఎం చంద్రబాబు అమరజీవికి ప్రాధన్యత ఇస్తూ ఆత్మార్పణ దినంగా జరుపుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమిళనాడు లోని పొట్టి శ్రీరాములు గ్రంధాలయం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిబాండ్‌ చేశారు టీజీ. వెంకటేష్. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్నారు టీజీ. వెంకటేష్.

Read more RELATED
Recommended to you

Latest news