రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డి కోసం విద్యార్థులతో ప్రత్యేకంగా పరేడ్ !

-

సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి కోసం విద్యార్థులతో ప్రత్యేకంగా పరేడ్ నిర్వహించారు అధికారులు. పాఠశాలకు వచ్చిన తిరుపతి రెడ్డికి ఎదురు వెళ్లి స్వాగతం పలికారు వికారాబాద్ జిల్లా కలెక్టర్. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడికి ఎలాంటి హోదా లేకపోయినా వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్వాగతం పలకడంపై విమర్శలు వస్తున్నాయి.

రేవంత్ రెడ్డి సోదరుడు అయినందుకే తిరుపతి రెడ్డికి ప్రత్యేక ప్రాధాన్యత ఎందుకు అంటూ ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రజాస్వామ్యమా? సామంతుల రాజ్యమా? అంటూ ప్రశ్నిస్తున్నారట కొడంగల్ వాసులు. సీఎం రేవంత్ సోదరుడు కావడమే తిరుపతి రెడ్డికి ప్రత్యేక అర్హతా ? అని నిలదీస్తున్నారు. పేరుకు ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యమని….కానీ వికారాబాద్ లో మాత్రం ఫ్యామిలీ పాలన అనుముల రాజ్యాంగం కొనసాగుతోందని ఫైర్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news