యూరియా కొరత.. క్యూ లైన్లో నానా తంటాలు పడుతున్న రైతులు

-

యాసంగి సీజన్ రావడంతో రైతులు తమ పొలాలను దుక్కి దున్నుతున్నారు.యాసంగి పంట వేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరిత కొరత ఉండటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని కో-ఆపరేటివ్ రైతు బజార్లో యూరియా కోసం రైతులు లైన్లో పడిగాపులు కాస్తున్నారు.తెల్లవారక ముందే వచ్చి లైన్లో నిలబడినా కూడా యూరియా బస్తాలు ఇవ్వలేకపోతున్నారని అన్నదాతలు సీరియస్ అవుతున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే స్పందించి సరిపడా యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. రైతుల ఆవేదనపై బీఆర్ఎస్ సైతం స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news