తెలంగాణ యూనివర్సిటీకి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేశాయి. తమకు రావాల్సిన బిల్లులు వెంటనే చెల్లించకపోతే కాలేజీలను నిరవధికంగా మూసేస్తామని హెచ్చరికలు పంపాయి. అయితే, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ, పీజీ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు గత కొంతకాలంగా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి.
ఏడాది నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని, దీంతో సిబ్బంది జీతభత్యాలు,కాలేజీ భవనాల అద్దెలు చెల్లించలేక పోతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి. అందుకే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే కాలేజీలను బంద్ చేస్తామని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు ప్రైవేటు కాలేజీలు తేల్చి చెప్పాయి. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాయి.