దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది : టీపీసీసీ చీఫ్​

-

భారత రాజ్యంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని గాంధీ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని బీజేపీ చూస్తోందన్నారు.పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అవమానించారని, ప్రధాని మోడీ వంత పాడారని విమర్శించారు.

దేశం కోసం మాజీ ప్రధాని నెహ్రూ దేశం కోసం ఏండ్ల తరబడిగా జైలు జీవితం గడిపారని, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం ఇచ్చారన్నారు. మరి దేశం కోసం ప్రధాని మోడీ ఏ త్యాగం చేశారని ప్రశ్నించారు.సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టవద్ధంటూ మాజీ ప్రధాని ఇందిరను అవమానించేలా బండి సంజయ్ మాట్లాడారని టీపీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news