వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మరోసారి నోరుపారేసుకున్నారు. ఇటీవల గుడివాడ్ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ హోంమంత్రిని ఆయన టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
‘నాపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు నేను స్పందించాల్సిన అవసరం లేదు..హోంమంత్రి రీల్స్ చూసుకొని కాలక్షేపం చేసేస్తే మంచిది. వైఎస్ జగన్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత తాజా పరిణామాలపై చర్చిస్తాం.పార్టీ మారే వాళ్లను సముదాయిస్తాం కానీ కాళ్లు పట్టుకోలేము కాదా..’ అని మాజీమంత్రి అమర్నాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా,వైసీపీ రాజ్యసభ సభ్వత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తరుణంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.