ఫుడ్ పాయిజన్..చావుబతుకుల్లో గురుకుల విద్యార్థిని!

-

తెలంగాణలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నా రాష్ట్ర సర్కార్ మొద్దు నిద్ర విడటం లేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే పదుల సంఖ్యకు పైగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు విద్యార్థులు సైతం తీవ్ర అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయారు.

అయినప్పటికీ ప్రభుత్వం యంత్రాంగం తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ఆ శాఖ నిర్వహణను గాలికొదిలేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టకుండా తనవద్దే విద్యాశాఖను ఉంచుకున్నారు.కానీ, విద్యాశాఖపై సమీక్షలు చేయడం లేదు. ఫలితంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడించే గురుకులాల్లో విద్యార్థులు అరిగోస పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ కేసముద్రం మండలం కస్తూర్బా గాంధీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నది. వెంటిలేటర్పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news