వేసవి రాకముందే మహబూబాబాద్ జిల్లాలోని జేఎన్టీయూ కాలేజీలో తాగేందుకు, స్నానాలు చేసేందుకు నీటి ఎద్దడి నెలకొంది. నీళ్లు లేకపోవడంతో చదువుకునేందుకు కాలేజీకి వచ్చే విద్యార్థినులతో జేఎన్టీయూ యాజమాన్యం నీళ్లను మోయిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు లేకపోవడంతో బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు అబ్బాయిలు చూస్తున్నారని కాలేజీ అమ్మాయిలు వాపోయారు. ఈ క్రమంలోనే అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని కళాశాల ఎదుట విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థునులు డిమాండ్ చేశారు.
తాగడానికి, స్నానాలు చేయడానికి నీళ్లు లేకపోవడంతో విద్యార్థినులతో మోయిస్తున్న జేఎన్టీయూ యాజమాన్యం
మహబూబాబాద్ జిల్లాలోని జేఎన్టీయూ కాలేజీలో తాగడానికి, స్నానాలు చేయడానికి నీళ్లు లేవు.. బయట నుంచి నీళ్లు తెచ్చుకుంటుంటే అబ్బాయిలు చూస్తున్నారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా… pic.twitter.com/QlWWSH7Tvs
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025