తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. రైతు భరోసా సాయం అందని వారు, అనగా ఒక ఎకరం లోపు ఉన్నవారికి నేటి (బుధవారం) నుంచి డబ్బులు రైతులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
నేటి నుంచి ఒక ఎకరం లోపు ఉన్న రైతులు మొత్తం 17.03 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాగా, గతంలో రైతు భరోసా డబ్బులు కొంత మందికే వచ్చాయి. రాని వారు ప్రభుత్వాన్ని నిలదీయం మొదలెట్టారు. మరల చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఎకరంలోపు ఉన్నవారికి రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.