నేరేడుచర్లలో నీటి ఎద్దడి.. ఐదు రోజులుగా మహిళల అవస్థలు

-

సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండలంలో గల పులగంబండా తండాలో సర్పంచుల పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించలేదు. ఫలితంగా బోరు మోటార్ కాలిపోయి.. 5 రోజులుగా తాగునీటికి తండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
గత్యంతరం లేక వ్యవసాయ బోర్ల నుంచి మహిళలు నీటిని ఎత్తుకొచ్చుకుంటున్నారు.

దీంతో ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి.సరిపడా నిధులు లేక సమస్య లపై అధికారులు స్పందించడం లేదు. బోరు మోటార్ కాలిపోయి పులగంబండా తండాలో గత 5 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం. గత్యంతరం లేక గిరిజన మహిళలు, చిన్నారులు పొలం గట్లపై నుంచి నడుచు కుంటూ వెళ్లి అతికష్టంపై వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. మోటార్‌కు మరమ్మతులు చేపట్టాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news