నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం (బ్లాక్ కార్యాలయం)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఖాళీ బూడిదయ్యాడు. మనిషితో పాటే కార్యాలయంలోని ఫైళ్లు సైతం దగ్ధమయ్యాయి. అయితే, మంటల్లో చనిపోయిన వ్యక్తి ఎవరా అనేది ఇంకా తెలియరాలేదు.
ఎంపీడీవో భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.అప్పటికే కార్యాలయంలో భద్రపర్చిన పాత ఎన్నికల సామగ్రి రూం, పక్కనే గోడ బయట ఉన్న టిఫైబర్ ఏసీ కేబుల్ వైర్ కాలి బూడిదయ్యాయి. కాగా, మంటలు ఆర్పుతున్న సమయంలో పొగ మొత్తం వెళ్లాక డెడ్ బాడీని ఫైర్ సిబ్బంది గుర్తించారు. ఆ వ్యక్తి ఆఫీసులో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? అందుకే ఈ ప్రమాదం జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.
ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో ఖాళీ బూడిదైన గుర్తు తెలియని వ్యక్తి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం (బ్లాక్ కార్యాలయం)లో అగ్ని ప్రమాదం
దీంతో ఒక్కసారిగా భవనంలో చెలరేగిన మంటలు.. అయితే గమనించిన స్థానికులు అగ్ని మాపక… pic.twitter.com/U9pwYxQdqe
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025