ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియలో బ్రిటీష్ కాలం నాటి పద్ధతులను మార్చాలి : బోయినపల్లి వినోద్

-

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియలో బ్రిటీష్ కాలం నాటి పద్ధతులను మార్చాలను బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను ఖండించారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవరని జోస్యం చెప్పారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవన్నారు. ఇదివరకు కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను మార్చి కొత్త విధానాన్ని తీసుకురావాలని బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

https://twitter.com/TeluguScribe/status/1889220155965890700

Read more RELATED
Recommended to you

Latest news