కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కూతురి పెళ్లిలో తండ్రి ఒక్కసారిగా కుప్పకూలాడు. అనంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఆయన మరణానికి గుండెపోటు కారణమని తేల్చారు.
అసలు విషయంలోకి వెళితే.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన బాలచంద్రం అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేయించారు. వేడుకలలో సంతోషంగా పాల్గొన్నారు. అయితే, కూతురు కాళ్లు కడిగిన అనంతరం అకస్మాత్తుగా చాతి దగ్గర పట్టుకుని కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో శుభకార్యానికి వచ్చిన వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.