బ్రేకింగ్ : UGC NET ఫలితాలు విడుదల..

-

యూజీసీ నెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌(JRF), వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత కోసం ఏటా 2సార్లు యూజీసీ నెట్ అర్హత పరీక్షను నిర్వహిస్తుంది. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతుండగా.. యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 ఫలితాలు ఆదివారం ఉదయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీయే తెలిపింది. యూజీసీ నెట్‌కు సంబంధించిన ‘కీ’ ఫిబ్రవరి 3న విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 6.49 లక్షల మంది హాజరవ్వగా.. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5,158 మంది, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్‌కు 48,161 మంది, పీహెచ్‌డీ కోసం 1,14,445 అర్హత సాధించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news