SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న వారు బతికే ఛాన్స్‌ లేదు – మంత్రి జూపల్లి

-

కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన ప్రకటన చేశారు. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న వారు బతికే అవకాశం లేదంటున్నారు మంత్రి జూపల్లి. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం కష్టంగా ఉందని వెల్లడించారు. టన్నెల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.

Chances of survival not good Telangana min on SLBC tunnel collapse

నీటి తీవ్రత ధాటికి టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ కొట్టుకొచ్చిందని వివరించారు కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు. 1 కిలో మీటర్ మేర నీరు, బురద ఉన్నాయన్నారు. ఇది ఇలా ఉండగా… టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ముందు 100 మీటర్ల మట్టి ఉందని చెబుతున్నారు అక్కడి అధికారులు. ఈ మట్టిని తీయడానికి 10-12 రోజులు పడుతుందట.

 

Read more RELATED
Recommended to you

Latest news