నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లి ఇష్టం లేక కానిస్టేబుల్ మృతి..?

-

తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లి ఇష్టం లేక కానిస్టేబుల్ మృతి చెందింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన కే.అనూష 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌కు ఎంపికై యాదాద్రిలోని హెడ్క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తుంది. కోహెడకు చెందిన యువకుడితో ఈనెల 14న నిశ్చితార్థం జరిగింది. మార్చి 6న వివాహం జరగాల్సి ఉంది.

Engaged Did not want to marry or constable died

భువనగిరిలోని విద్యానగర్‌లో మహిళా ఏఆర్ కానిస్టేబుల్ ఉరేసుకొని అనూష ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పెళ్లి ఇష్టంలేకనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అయితే… సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన కే.అనూష మరో వ్యక్తిని ప్రేమించిందా… లేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news