శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం మూడు గంటల ఆలస్యం మైంది. దీంతో ప్రయాగ్ రాజ్ వెళ్లే విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహాశివరాత్రి పర్వదినం కావడంతో నేటితో ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా ముగియనుంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇక్కడే తమ విలువైన సమయం వృథా అవుతోందని, కుంభమేళాకు ఎప్పుడు వెళ్లాలని వారంతా నిరసనకు దిగినట్లు సమాచారం. కాగా, దీనిపై స్పైస్ జెట్ సంస్థ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.